వంశీ అసలు కోపమంతా లోకేష్ మీదేనా ?  

Vallabhaneni Vamshi Angry On Nara Lokesh-gannavaram Mla Vallabhaneni Vamshi,juniour Ntr,tdp Chief Chandrababu Naidu,vallabhaneni Vamshi

కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి సైలెంట్ గా ఉంటూ వచ్చిన వల్లభనేని వంశీ మోహన్ చంద్రబాబు విజయవాడలో ఇసుక దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి మళ్లీ యాక్టివ్ అవ్వడమే కాకుండా తెలుగుదేశం పార్టీపై, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసుకుంటూ విమర్శల వర్షం కురిపించారు.ఈ ఎపిసోడ్లో వంశీ టార్గెట్ అంతా లోకేష్ అన్నట్టుగానే సాగుతూ వస్తోంది.అసలు వంశీ టీడీపీలో యాక్టివ్ గా ఉన్నప్పటికి నుంచి లోకేష మీద అసంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.ఆయన వ్యవహార శైలి తో విసిగిపోయి వంశీ పార్టీకి దూరమయ్యారు అనే గుసగుసలు కూడా లేకపోలేదు.

Vallabhaneni Vamshi Angry On Nara Lokesh-gannavaram Mla Vallabhaneni Vamshi,juniour Ntr,tdp Chief Chandrababu Naidu,vallabhaneni Vamshi Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys-Vallabhaneni Vamshi Angry On Nara Lokesh-Gannavaram Mla Juniour Ntr Tdp Chief Chandrababu Naidu

తాజాగా వంశీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ లోకేష్ కార్నర్ అయ్యేలా విమర్శలు తీవ్రస్థాయిలో మొదలుపెట్టారు.

వంశీ లాంటి వ్యక్తులు వెళ్లిపోతే పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదు అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన వంశీ విరుచుకుపడ్డాడు.తాను వెళ్లి పోతే నష్టం లేదని లోకేష్ అన్నాడని , కానీ అలాంటి వ్యక్తి ని మోయలేకే పార్టీ పడవ మునిగిపోతున్న విషయన్ని ఎవరూ గుర్తించడంలేదంటూ వంశీ వెటకారం చేశారు.నేను పార్టీలో ఉన్నప్పుడు తనపై కేసులు నమోదయ్యి ఇబ్బందిపడ్డా ఎవరూ తనకు మద్దతుగా నిలబడలేదని, కానీ ఇప్పుడు కేసులు, ఆస్తుల కోసం భయపడ్డానని సోషల్ మీడియాలోనూ టిడిపి కి సంబంధించిన ప్రచమాధ్యమాల్లోనూ తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని వంశీ మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీకి లోకేష్ ఓ పెద్ద గుదిబండ, స్పీడ్ బ్రేకర్ అంటూ విమర్శలు చేశారు.

తనపై విమర్శలు చేస్తున్న పప్పు మంగళగిరిలో ఎందుకు గెలవలేదు అంటూ ప్రశ్నించారు.

పార్టీని నడపడానికి చంద్రబాబు కొడుకు అని ఒక హోదా తప్ప లోకేష్ లో ఏం క్వాలిటీ ఉందని, తాను లోకేష్ వలె అమ్మను, అయ్యాను అడ్డం పెట్టుకుని ఎదగలేదని, చంద్రబాబు లేని రోజున లోకేష్ కు వాడి బతుకు ఏంటో తెలుస్తుందని అన్నారు.తాను ఆస్తులను కాపాడుకునేందుకే పార్టీ మారాను అంటున్నారని నాకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఆధారాలతో లోకేష్ బయటపెట్టాలని వంశీ డిమాండ్ చేశారు.అంతే కాదు గన్నవరంలో కనుక ఉప ఎన్నిక వస్తే లోకేష్, దేవినేని ఉమా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని, దమ్ముంటే గన్నవరంలో లోకేష్ మాత్రమే కాదు వాళ్ళ బాబు కూడా పోటీ చేయవచ్చు అంటూ సవాల్ విసిరారు.అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ పది జన్మలు ఎత్తినా జూనియర్ ఎన్టీఆర్ కాలేదంటూ ఎద్దేవా చేసారు.

కుక్క బిస్కెట్లు గాళ్ళను పక్కన పెట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని, లోకేష్ కు పాలు, పెరుగు, తోటకూర అమ్ముకోవడానికి హెరిటేజ్ ఉందని, టిడిపి కి ఏమీ లేదన్నారు.అసలు జూనియర్ ఎన్టీఆర్ కు, లోకేష్ కు చాలా మంది పోలిక పెడుతున్నారని, ఆయనకు ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే లోకేష్ కు దడ, వణుకు అంటూ ఎద్దేవా చేశారు.మొత్తంగా చూస్తే లోకేష్ పై వంశీకి పీకల్లోతు కోపం ఉన్నట్టుగా అర్ధం అయిపోతోంది.