పప్పు అని నేను అనలేదు ఆయనే అన్నాడు  

Vallabaneni Vamsi Fires On Chandrababu And Lokesh-

తనపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు.టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు.నేను హైందవ సంప్రదాయాన్ని అగౌరవపరుస్తున్నానని వారు చేస్తున్న ఆరోపణలు చేస్తున్నారు.కానీ వాళ్ళలాగా వేయికాళ్ల మండపం కూల్చలేదని, దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించలేద ని, టీటీడీ చైర్మన్, బోర్డు పదవులు అమ్ముకోలేదు అంటూ వంశీ ఆరోపించారు.తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళితే వారి రాజీనామా ఎందుకు కోరలేదు, ఇప్పుడు నా రాజీనామా ఎందుకు కోరుతున్నారు అంటూ ప్రశ్నించారు.

Vallabaneni Vamsi Fires On Chandrababu And Lokesh- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Vallabaneni Vamsi Fires On Chandrababu And Lokesh--Vallabaneni Vamsi Fires On Chandrababu And Lokesh-

అసలు ప్రజల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన తనను ఓడిపోయి దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయిన లోకేష్ ప్రశ్నించడం ఏంటి అని వంశీ మండిపడ్డారు.అసలు ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ తన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయలేదంటూ నిలదీశారు.మీకు దమ్ముంటే టీడీపీ నుంచి బిజెపి లోకి వెళ్ళిన నలుగురు ఎంపీలను తొలగించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చంద్రబాబుకు సవాల్ విసిరారు.కేసులకు భయపడి తాను పార్టీ మారలేదని తనపై ఓటుకు నోటు కేసు కూడా లేదని, తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కేసులు ఉన్నాయన్నారు.రామవరప్పాడులో పేదలకు ఇళ్లు తీసినప్పుడు టిడిపి ప్రభుత్వం తనపై కేసు పెట్టిందని అప్పుడే భయపడేది లేదని ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని వంశీ చెప్పారు.లోకేష్ ను పప్పు అని తాను అనలేదని రామ్ గోపాల్ వర్మ పప్పు అంటూ పాట తీసారని అన్నారు.

Vallabaneni Vamsi Fires On Chandrababu And Lokesh- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Vallabaneni Vamsi Fires On Chandrababu And Lokesh--Vallabaneni Vamsi Fires On Chandrababu And Lokesh-

చంద్రబాబుని ఎన్టీఆర్ మంత్రిని చేస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, పార్టీ నాయకత్వం తీరు నచ్చక పోతే జగన్ లా సొంత పార్టీ పెట్టుకోవాలి కానీ ఉన్న పార్టీని లాక్కోవడం ఏంటి అంటూ వంశీ ప్రశ్నల వర్షం కురిపించారు.