సర్వే రిపోర్ట్‌ : ప్రేమ విషయంలో అబ్బాయి, అమ్మాయిల్లో ఎవరు ఎక్కువ సీరియస్‌ తెలుసా?

ఈమద్య కాలంలో ప్రేమలో పడటం చాలా కామన్‌ అయ్యింది.అయితే బ్రేకప్‌ కూడా అంతకు మించి కామన్‌ అయ్యింది.

 Valentines Day Survey About Lovers In Mumbai-TeluguStop.com

అప్పట్లో ప్రేమిస్తే 90 శాతం మంది పెళ్లి చేసుకునే వారు.లేదంటే ఏవో కారణాల వల్ల విడిపోయే వారు.

కాని ఇప్పుడు మాత్రం అలా కాదు చిన్న చిన్న కారణాలు చెబుతూ బ్రేకప్‌ అంటున్నారు.అప్పుడు విడిపోవడానికి కారణం తల్లిదండ్రులు అయితే ఇప్పుడు వారికి వారే కారణం అవుతున్నారు.

ప్రస్తుతం ప్రేమ పరిస్థితి చూస్తుంటే చిత్రంగా ఉంది.

Telugu Boy Love, Love, Love Wiral, Day-General-Telugu

ప్రేమలో పడ్డ వారు జీవితంలో అన్ని మర్చి పోయి ఎంజాయ్‌ చేస్తారని అంతా అనుకుంటారు.కాని ప్రేమలో ఉన్న సమయంలో ఉన్న ఇప్పటి తరం వారు మాత్రం ఎప్పుడు తన ప్రియుడు లేదా ప్రేయసి తమకు బ్రేకప్‌ చెప్పి వెళ్లి పోతారా అని ఆందోళనతో ఉన్నారట.ఈ విషయం మేము చెబుతున్నది కాదు, మొన్న ముంబయిలో వాలెంటైన్స్‌ డే సందర్బంగా ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వెళ్లడయిన నిజం.

ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారు అన్నప్పుడు ఇలాంటి సమాదానం వారి నుండి వచ్చింది.

Telugu Boy Love, Love, Love Wiral, Day-General-Telugu

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే ఎక్కువ శాతం అబ్బాయిలే ఈ అభద్రతా భావంలో ఉన్నారట.ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.తన ప్రేయసి తనకు ఎక్కడ, ఎప్పుడు గుడ్‌ బై చెబుతుందో అనే టెన్షన్‌లో చాలా మంది అబ్బాయిలు ఉన్నారట.

తన ఇంట్లో వారు పెళ్లి ఫిక్స్‌ చేశారంటూ ఎప్పుడు వెళ్లి పోతారో అనే భయంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.అబ్బాయిలు కుటుంబ సభ్యులను ఎదిరించేందుకు సిద్దంగా ఉన్నారు.కాని అమ్మాయిలు మాత్రం అమ్మానాన్నల తర్వాతే ప్రేమ అంటున్నారట.

Telugu Boy Love, Love, Love Wiral, Day-General-Telugu

అమ్మా నాన్న ముందు అని ప్రేమించకుండా ఉంటారా అంటే అదీ లేదు.అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రేమిస్తారు.కాని వారికి తెలియకుండా పెళ్లికి మాత్రం నో అంటున్నారు.

ఇక ప్రేమ విషయంలో అబ్బాయిలు చాలా సీరియస్‌గా ఉంటే అమ్మాయిలు మాత్రం విడిపోతే పోదాం ఏముంది అన్నట్లుగా లైట్‌గా ఉంటున్నారట.ప్రేమించుకున్నన్ని రోజులు ప్రేమించుకుని ఆ తర్వాత కుదిరితే పెళ్లి చేసుకుందాం లేదంటే విడిపోయి వేరు వేరుగా హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అంటున్నారు.

అమ్మాయిలు నిజంగా చాలా మారారు అనేందుకు ఈ సర్వేనే నిదర్శణం.ఏమంటారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube