చోద్యం : ఆ చెట్టుకు కండోమ్‌ కడితే అమ్మాయి పడుతుందట.. ఆరు నెలల్లో వర్జినిటీ పోతుందట

మూడు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల రోజు దినోత్సవంను వైభవంగా జరుపుకున్నారు.ఆ రోజు తమ ప్రియుడు లేదా ప్రియురాలికి గిఫ్ట్‌లు ఇచ్చి సంతోష పెడతారన్నమాట.

 Valentines Day Ritual At Hindu College-TeluguStop.com

గిఫ్ట్‌లు అనే కాకుండా ప్రేమికులకు ఒక మంచి రోజుగా చెప్పుకుంటూ ఉంటారు.ప్రేమికుల రోజు సందర్బంగా ప్రేమికులు తమ ప్రేమను మరింతగా పెంచుకునేందుకు పార్టీలు చేసుకుంటారు.

ప్రపంచం మొత్తం ఇలా జరుపుకుంటూ ఉంటే ఢిల్లీలోని హిందూ కాలేజ్‌లో మాత్రం ప్రేమికుల రోజు దినోత్సవంను చాలా విభిన్నంగా జరుపుకున్నారు.ప్రతి సంవత్సరం కూడా ప్రేమికుల రోజును అక్కడ చాలా విభిన్నంగా జరుపుకుంటూ ఉంటారు.

ప్రేమికుల రోజు సందర్బంగా ఢిల్లీ హిందూ కాలేజ్‌ హాస్టల్‌లో ఉన్న ఒక చెట్టుకు పూజలు చేస్తారు.అది కూడా ఎలా అంటే కండోమ్స్‌ను ఆ చెట్టుకు కట్టి, హీరోయిన్స్‌ లేదా అందమైన అమ్మాయిల ఫొటోలను చెట్టుకు పెట్టి ఒక వేడుకలా నిర్వహిస్తారు.

కండోమ్‌లో నీళ్లు పోసి ఆ కండోమ్‌ను ప్రేమికుల రోజున ఆ చెట్టుకు కడితే వర్జిన్‌ అయిన అబ్బాయిలు ఆరు నెలలు తిరగకుండానే వర్జినిటీని కోల్పోతాడట.అంటే అందమైన అమ్మాయి ప్రేయసిగా దొరికి వారితో శృంగార సంబంధం ఏర్పడుతుంది అనేది వారి ఉద్దేశ్యం.

కాలేజ్‌కు వచ్చే ప్రెషర్స్‌ అంతా కూడా ఈ విధంగా చేస్తారు.ప్రెషర్స్‌ను సీనియర్స్‌ ఈ విధంగా వెల్‌కం చెప్తారు.

ఒకప్పుడు ఇండియాలో వ్యాలైంటెన్స్‌ డే గురించి పెద్దగా తెలియని సమయంలో ఈ కాలేజీలోని ఇదే చెట్టు వద్ద ప్రేమికులు చాలా మంది కూర్చుని మాట్లాడుకునే వారు.అయితే టెక్నాలజీ పెరిగింది, వాట్సప్‌, ఫేస్‌బుక్‌ అంటూ రావడంతో ప్రేమికులు డైరెక్ట్‌గా మాట్లాడుకోవడం మానేశారు.దాంతో ఈ చెట్టు వద్ద రద్దీ తగ్గింది.అయినా కూడా ఈ చెట్టుకు ఎన్నో ప్రేమ జంటలను కలిపిన అనుభవం ఉందని, అందుకే ఈ చెట్టుకు కండోమ్స్‌ కట్టి తమ వర్జినిటీ పోగొట్టుకునేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తారు అంటూ స్థానికులు చెబుతున్నారు.

హిందూ కాలేజ్‌లో ఏంటీ కండోమ్స్‌ పెస్టివల్‌, చెట్టుకు కండోమ్స్‌ పెట్టడం ఏంటీ అంటూ కొందరు విమర్శలు చేసినా, కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా విద్యార్థులు మాత్రం ప్రతి ఏడాది అనుకున్నట్లుగానే చేసి తీరుతున్నారు.దాంతో ఈమద్య కాలంలో ప్రిన్స్‌పల్‌ మరియు ఇతరులు కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు.అయితే కండోమ్‌ కట్టిన వారిలో ఎంతమంది వర్జినిటీ కోల్పోయారు అనే విషయాన్ని ప్రశ్నించిన సమయంలో ఆ కాలేజ్‌ వారు ఎవరు సరైన సమాధానం చెప్పడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube