పవన్, సురేందర్ కోసం కథ సిద్ధం చేసిన వక్కంతం వంశీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాడు.కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదిలోనే ఏకంగా మూడు నుంచి నాలుగు సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

 Vakkantham Vamsi Ready To Story For Pawan Kalyan Movie, Surendar Reddy, Ram Tall-TeluguStop.com

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇక ప్రస్తుతం అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.

ఇప్పటికే అయ్యప్పన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.మరో వైపు క్రిష్ సినిమా షూటింగ్ మొదలై పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలని ఇన్ని రోజులు షూట్ చేశారు.

ఇప్పుడు మొఘలాయిల కాలం నాటి హైదరాబాద్ సెట్ లో జరగనున్న షూటింగ్ లో పవన్ జాయిన్ కాబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు ఉన్నాయి.

ఇప్పటికే హరీష్ శంకర్ పోలీస్ కథాశంతో పవన్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసి దాని మీద వర్క్ చేస్తున్నాడు.ఇక సురేందర్ రెడ్డి తనకి భాగా అలవాటైన స్టార్ రైటర్ వక్కంతం వంశీతో కనెక్ట్ అయ్యాడు.

అతనితో అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేయిస్తున్నాడు.ఇప్పటికే స్టొరీ లైన్ కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది.

పవన్ కూడా దానికి ఒకే చెప్పడంతో వక్కంతం ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు. వక్కంతం వంశీ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్, సురేందర్, వక్కంతం కలయికలో సినిమా వస్తున్న విషయం కన్ఫర్మ్ అయ్యింది.పీఎస్పీకే29 అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube