హాట్ బ్యూటీ 'ఆంటీ' లుక్‌.. ఫ్యాన్స్ అన్ హ్యాపీ

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ నివేథా థామస్‌.వకీల్‌ సాబ్‌ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన ఈమె నటిగా మంచి మార్కులు దక్కించుకుంది.

 Vakeelsaab Movie Heroine Nivetha Thamos New Look, Film News , Nivetha Thomas, P-TeluguStop.com

ప్రస్తుతం నివేథా థామస్‌ హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో వివిధ పాత్రల్లో నటిస్తుంది.అయితే ఈమె కేవలం గ్లామర్ డాల్‌ గా స్కిన్‌ షో చేయకుండా మాత్రమే సినిమా లు చేయకుండా డీ గ్లామర్ గా కూడా నటించేందుకు సిద్దం అవుతోంది.

తెలుగు లో ఈమె నటించిన సినిమాలు చాలా ఉన్నాయి.అందులో పలు సినిమా లతో నటిగా మంచి గుర్తింపును ఈమె దక్కించుకుంది.

బొద్దుగా ముద్దుగా ఉండే నివేథా థామస్‌ అంటే అభిమానులు చాలా మంది ఉన్నారు.సోషల్‌ మీడియాలో తన హాట్‌ ఫొటో షూట్ ను షేర్‌ చేయకుండా రెగ్యులర్‌ లైఫ్ స్టైల్‌ ఫొటోలను ఆమె షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది.

అలాంటి నివేథా మరింత బొద్దుగా ఆంటీలా అయినట్లుగా ఉంది.

తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ లు లేకపోవడంతో నివేథా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది.దానికి తోడు ఆమె మేకప్‌ పై శ్రద్ద కనపబర్చడం లేదేమో ఏమో కాని ఇలా మరీ నార్మల్ గా కనిపించింది.

అయితే ఈ లుక్‌ లో కూడా నివేథా సూపర్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Telugu Nivetha Thomas, Story, Vakeel Saab-Movie

పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ఈ ఫొటో కు లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి.ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫొటోను కొందరు ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం మీరు ఎలా ఉన్నా కూడా ఇంత అందంగా ఎలా ఉంటారు మేడం అంటూ నెటిజన్స్‌ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.వకీల్ సాబ్ తర్వాత తెలుగులో ఈమె రెండు సినిమా ల్లో కనిపించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube