అయ్యో పాపం వకీల్ సాబ్‌ మరీ ఇలా అయ్యాడేంటి.. బన్నీ నుండి పిలుపు రానట్లేనా?

వేణు శ్రీరామ్ తెలుగు లో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా 2011లో ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లో ఆ సమయంలో వచ్చిన పలు సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ అందించాడని టాక్ ఉంది.

 Vakeel Saap Movie Director Venu Sriram Not Getting Movie Chance ,venu Sriram , P-TeluguStop.com

ఇక వేణు శ్రీరామ్ నాని తో 2017 సంవత్సరంలో ఎంసీఏ అనే సినిమా ను తెరకెక్కించి సూపర్ హిట్ దక్కించుకున్నాడు.ఆ సినిమా తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ వకీల్ సాబ్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని సినిమాలను కూడా దిల్ రాజు నిర్మించాడు.తదుపరి సినిమా విషయంలో కూడా దిల్ రాజ్ తో చర్చలు జరిగాయి, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయింది.

అల్లు అర్జున్ తో ఐకాన్ అనే సినిమా ను ప్రకటించాడు.కానీ అది కూడా పట్టాలెక్కలేదు.

వకీల్ సాబ్‌ విడుదల అయ్యి రెండు సంవత్సరాలుగా అవ్వబోతుంది.అయినా ఇప్పటి వరకు వేరే ఏ సినిమా కు సంబంధించిన అప్డేట్ లేదు.

Telugu Allu Arjun, Dil Raju, Icon, Mca, Nani, Pawan Kalyan, Telugu, Vakeel Saab,

దిల్ రాజు కాంపౌండ్ లోనే వేణు శ్రీరామ్ ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.అల్లు అర్జున్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడా, లేదంటే కొత్త కథ ను రెడీ చేస్తున్నాడా అనేది కూడా క్లారిటీ లేదు.మొత్తానికి దర్శకుడు వేణు శ్రీరామ్ విషయం లో ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Arjun, Dil Raju, Icon, Mca, Nani, Pawan Kalyan, Telugu, Vakeel Saab,

హిట్ దక్కించుకున్నప్పుడు వెంటనే సినిమా మొదలు పెట్టాలి, అలా కాదంటే హిట్ పడి వేస్ట్.హిట్ ని సద్వినియోగం చేసుకోవడం కొద్ది మందికి తెలుస్తుంది.అది వేణు శ్రీరామ్ కి తెలియడం లేదు అంటూ సినీ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో సినిమా చేసిన సమయం లో కచ్చితంగా మంచి ఇమేజ్ బిల్డ్‌ అవుతుంది.వేణు శ్రీరామ్ ఆ ఇమేజ్ ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు.

ఈ ఏడాది లో సినిమా ప్రారంభించి, వచ్చే ఏడాదిలోనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేనా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube