యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దాదాపు రెండేళ్ల తరువాత పవన్ చేయబోయే విధ్వంసం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Vakeel Saab Trailer Shaking Youtube, Vakeel Saab, Pawan Kalyan, Pspk, Vakeel Saa-TeluguStop.com

దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌గా నిలిచిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ కోసం యావత్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు.ఇక ఈ ట్రైలర్ పూర్తిగా పవర్‌ప్యాక్డ్‌గా ఉండటం, తమ అభిమాన హీరోను పూర్తి యాక్షన్ మోడ్‌లో చూసి చాలా రోజులు కావడంతో, పవన్ అభిమానులు ఈ సినిమా ట్రైలర్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.

కాగా ఈ ట్రైలర్ రిలీజ్ అయిన గంటలోపే ఏకంగా 500K లైకులు తెచ్చుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక ఈ ట్రైలర్ ఒక గంటలో ఏకంగా 455K వ్యూస్‌తో యూట్యూబ్‌ను దడదడలాడిస్తోంది.

మొత్తానికి ఆకలి మీద ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు వకీల్ సాబ్ బిర్యానీలా దొరికిందని చెప్పాలి.ఈ సినిమా ట్రైలర్‌లో పవన్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో పాటు థమన్ డెడ్లీ బీజీఎం కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఇక వేసవి కానుకగా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న వకీల్ సాబ్ థియేటర్లలో ఎలాంటి రచ్చ చేయబోతుందా అనే ఆసక్తి అప్పుడే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ శృతి హాసన్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి వకీల్ సాబ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 9 వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube