వకీల్ సాబ్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..?  

Vakeel Saab Trailer On This Day, Vakeel Saab, Pawan Kalyan, PSPK26, Venu Sriram - Telugu Pawan Kalyan, Pspk26, Vakeel Saab, Venu Sriram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తరువాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.పవన్ తన 26వ చిత్రంగా ‘వకీల్ సాబ్’ అనే చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

 Vakeel Saab Trailer On This Day

బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రేక్షకులకు మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వకీల్ సాబ్ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులు అప్పటివరకు కాస్త తగ్గుముఖం పట్టవచ్చని, దీంతో పవన్ ఫ్యాన్స్‌ను ఇంతకాలం వెయిట్ చేయిస్తున్న కారణంగా ఈ ట్రైలర్ వారి ఎదురుచూపులకు పర్ఫెక్ట్ గిఫ్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ భావించింది.

వకీల్ సాబ్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో వారు ఈ దిశగా ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తోండగా, కేమియో పాత్రలో శృతి హాసన్ నటిస్తోందనే వార్త వినిపిస్తుంది.

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి దసరాకైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

#PSPK26 #Vakeel Saab #Pawan Kalyan #Venu Sriram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vakeel Saab Trailer On This Day Related Telugu News,Photos/Pics,Images..