నెలాఖరు నుంచి వకీల్ సాబ్ షూటింగ్... డిసెంబర్ లో పవన్ కళ్యాణ్

కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా ఆరంభంలో ఉన్నంత భయం అయితే ఇప్పుడు లేదు.కరోనా భయాన్ని పక్కన పెట్టి ప్రజలు వారి జీవనంలో ఎప్పటిలాగే ముందుకి వెళ్తున్నారు.

 Vakeel Saab To Resume Shoot Sans Pawan Kalyan, Tollywood, Dil Raju, Venu Sriram,-TeluguStop.com

పనులలో నిమగ్నం అవుతున్నారు.ఆరు నెలల పాటు ఆగిపోయిన జీవితానికి మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు.

మన ప్రయాణంలో ఆగిపోవాలే తప్ప కాలం మన కోసం ఎప్పటికి ఆగదని కరోనా ప్రతి ఒక్కరికి పాఠం నేర్పింది.ఇదిలా ఉంటే కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆరు నెలల పాటు సినిమా షూటింగ్ లు కూడా పూర్తిగా బంద్ అయిపోయాయి.

దీంతో లక్షల మంది సినిమాపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బ్రతుకుతున్న వారి జీవితాలు దుర్భరంగా మారాయి.అయితే పరిస్థితులు మారిపోవడంతో వారి ఉపాధి మార్గాలు కూడా అందరూ మార్చుకున్నారు.

అయితే నటులుగా, నిర్మాతలుగా, దర్శకులుగా ఉన్నవారు వారి ఉపాధి మార్గాలు మార్చుకోలేరు.అందుకే ప్రభుత్వ నిబంధనలకి లోబడి కొంత కాలం ఎదురుచూసి మరల సినిమా షూటింగ్ లకి సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ మొదలయ్యాయి.అలాగే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం షూటింగుకి కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.ఒక నెల రోజుల షెడ్యూల్ మాత్రమే ఇంకా మిగిలి ఉంది.అవి కూడా పవన్ కళ్యాణ్ కి సంబందించిన సన్నివేశాలు షూట్ చేయాలి.

పవన్ కళ్యాణ్ డిసెంబర్ లో షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఇంకా మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ అంతా ముందుగా ఫినిష్ చేసుకోవడానికి ఈ నెల చివరి వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అదే సమయంలో వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేసి పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చేసి అతని డబ్బింగ్ కూడా ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube