అక్కడ ఇక్కడ అన్ని చోట్ల రికార్డు బ్రేక్‌ ఖాయం అంటున్న వకీల్‌ సాబ్

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్ కలెక్షన్స్‌ విషయంలో రికార్డుల మ్రోత మోగడం ఖాయం అంటూ తేలిపోయింది.అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా వకీల్‌ సాబ్‌ వసూళ్లతో దుమ్ము రేపబోతున్నాడు అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Vakeel Saab Record Breaking Collections In Fast Day , Pawan Kalyan, Sruthi Hassa-TeluguStop.com

వకీల్‌ సాబ్‌ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ ఎత్తున విడుదలకు సిద్దం అయ్యింది.ఇక బెన్‌ ఫిట్‌ షో లు మరియు మిడ్‌ నైట్‌ షో లతో వకీల్‌ సాబ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రత్యేక షోలకు టికెట్ల రేట్లు ఏ రేంజ్‌ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక సాదారణ షో లకు కూడా దాదాపుగా నేరు శాతం టికెట్‌ రేట్లను పెంచినట్లుగా సమాచారం అందుతోంది.

ఓవర్సీస్‌ లో మరియు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు మరో రేంజ్ లో ఉండబోతున్నాయి.కారణం ఈ సినిమా కోసం ప్రభుత్వం టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో వకీల్‌ సాబ్‌ సినిమా ను ఓవర్సీస్‌ లో దాదాపుగా 300 స్క్రీన్స్‌ లో స్క్రీనింగ్‌ కు సిద్దం అయ్యింది.ఈ సినిమా మొదటి అయిదు ఆటలకు పెద్ద మొత్తంలో అమౌంట్‌ ను వసూళ్లు చేస్తున్నారు.

దీనికి తోడు సినిమా వసూళ్ల విషయంలో రికార్డు బ్రేకింగ్ అయ్యేలా టికెట్ల రేట్లను పెంచడం జరిగిందని అంటున్నారు.పెంచిన టికెట్ల రేట్ల కారణంగా అన్ని చోట్ల కూడా ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్‌ దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.

 వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను దిల్‌ రాజు నిర్మించాడు.శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube