వకీల్ సాబ్ చిత్రంలోని ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి అమ్మాయిలు కావాలని అడుగుతున్నారట...

తెలుగులో ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో శృతిహాసన్, నివేద థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Vakeel Saab Phone Number Controversy-TeluguStop.com

కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మరియు బోనికపూర్ తదితరులు సంయుక్తంగా నిర్మించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

అంతేకాకుండా విడుదలైన మొదటి వారంలోనే దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.

 Vakeel Saab Phone Number Controversy-వకీల్ సాబ్ చిత్రంలోని ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి అమ్మాయిలు కావాలని అడుగుతున్నారట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఈ వకీల్ సాబ్ చిత్ర దర్శకుడిపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంతకీ కారణం ఏమిటంటే వకీల్ సాబ్ చిత్రంలోని ఓ సన్నివేశంలో అమ్మాయిలు కావాలంటే ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండని ఏదో ఒక సెల్ ఫోన్ నెంబర్ ని చిత్ర యూనిట్ సభ్యులు ఉపయోగించారు.దీంతో వకీల్ సాబ్ చిత్రాన్ని చూసినటువంటి కొందరు వ్యక్తులు ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి తరచూ అమ్మాయిలు కావాలని వేధిస్తున్నారట.

దీంతో ఆ సెల్ ఫోన్ నెంబర్ ఉపయోగిస్తున్న వ్యక్తి తాజాగా హైదరాబాద్ నగరంలోని పంజా గుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అనంతరం ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ వకీల్ సాబ్ చిత్రంలో తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ ని ఉపయోగించారని దాంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని తెలిపాడు.

అంతేగాక రాత్రి సమయంలో కొందరు ఫోన్లు చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాధితుడు వాపోయాడు.దీంతో ఈ చిత్రంపై తాను పరువు నష్టం దావా వేస్తానని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ సెల్ ఫోన్ నెంబర్ కాంట్రవర్సీ పై మాత్రం ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు గానీ లేదా దర్శకుడు శ్రీరామ్ వేణుగానీ స్పందించలేదు.కాగా గతంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “వి” చిత్రంలో కూడా బాలీవుడ్ ముంబై బ్యూటీ మోడల్ “సాక్షి మాలిక్” పేరు ని ఓ సన్నివేశంలో ఉపయోగించడంతో ఆమె కోర్టులో ఫిర్యాదు చేసింది.

దీంతో ఆ సన్నివేశంలోని పేరును తొలగించాలంటూ చిత్ర యూనిట్ సభ్యులకు కోర్టు  సూచించింది మరి వకీల్ సాబ్ చిత్రంలోని సెల్ ఫోన్ నెంబర్  కాంట్రవర్సీ పై చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

#VakeelSaab #VakeelSaab #Vakeel Saab #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు