2020లో సింహం సింగిల్‌గా దిగుతోంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Vakeel Saab Only Movie To Release In 2020, Vakeel Saab, Pawan Kalyan, Venu Srira-TeluguStop.com

ఇక ఈ సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని పవన్ చూస్తున్నాడు.అయితే ఇప్పటికే రిలీజ్ కావాల్సిన వకీల్ సాబ్ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

ఇక కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిల ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కానీ కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ఇప్పట్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించే ఆలోచనలో లేరట చిత్ర స్టార్స్.

దీంతో ఈ ఏడాదిలో రిలీజ్ కావాల్సిన సినిమాలు 2021లో రిలీజ్ చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.కానీ పవన్ మాత్రం ఏది ఏమైనా ఈ ఏడాదిలో వకీల్ సాబ్‌ను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

దీనికి తగ్గట్టుగానే సినిమాలో మిగిలిన షూటింగ్‌ను అతి త్వరలో పూర్తి చేయాలని చూస్తున్నాడు.ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను 2020లోనే రిలీజ్ చేయాలని పవన్ చిత్ర యూనిట్‌కు సూచించాడట.

అంటే, 2020లో రిలీజ్ అయ్యే స్టార్ హీరోల చిత్రాల్లో కేవలం పవన్ సినిమా ఒక్కటే ఉందని తెలుస్తోంది.మరి వకీల్ సాబ్ చిత్రాన్ని పవన్ ఎప్పుడు పూర్తి చేస్తాడో, ఎప్పుడు రిలీజ్ చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube