కొట్లాటతోనే దిగుతున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో పవన్ రీఎంట్రీ పవర్‌ఫుల్‌గా ఉండనుందనే విషయం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఇట్టే అర్ధమవుతోంది.

 Pawan Kalyan, Vakeel Saab, Pawan Entry, Venu Sriram-TeluguStop.com

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ అనే పేరుతో రీమేక్ చేస్తుండటంతో, పవన్ ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పవన్ దాదాపు రెండేళ్ల తరువాత వెండితెరపై కనిపించనున్నాడు.

మరి ఇంత గ్యాప్ తరువాత పవన్ ఎంట్రీ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలో పవన్ ఓ అదిరిపోయే ఫైట్ సీన్‌తో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో కూడా ‘పింక్’లో కూడా ఇంట్రో సీన్ చాలా భిన్నంగా ఉంటుంది.దీంతో పవన్ ఫ్యాన్స్ పవన్ ఫైట్ ఏ రేంజ్‌లో ఉంటుందా అనే అంశంపై చర్చించుకుంటున్నారు.

కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube