నాలుగు గోడల మధ్యే హైలైట్ కానున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Court Scenes In Vakeel Saab To Be Highlight, Vakeel Saab, Pawan Kalyan, Pspk26,-TeluguStop.com

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో కీలకమైన కోర్టు సీన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలువనున్నట్లు తెలుస్తోంది.

ఈ సీన్స్‌లో పవన్ యాక్టింగ్, ఆయన చెప్పే డైలాగులకు ప్రేక్షకులు మెస్మరైజ్ కావడం పక్కా అని తెలుస్తోంది.ఈ కోర్టు సీన్స్ చాలా కీలకంగా ఉండనుండటంతో వీటిని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదని చిత్ర వర్గాల టాక్.

ఇక ఈ సీన్స్‌లో వచ్చే డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చిత్రాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

వకీల్ సాబ్ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా నివేదా థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమాలోని కోర్టు సీన్స్ ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేస్తాయో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube