వకీల్ సాబ్ షూటింగ్ స్టార్ట్… అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ జాయిన్  

Vakeel Saab Movie Shooting Started, Tollywood, Dill Raju, Director Venu Sriram, Vakeel Saab Movie, Pawan Kalyan - Telugu Dill Raju, Director Venu Sriram, Pawan Kalyan, Tollywood, Vakeel Saab Movie, Vakeel Saab Movie Shooting Started

కరోనా లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో దర్శక, నిర్మాతలు అందరూ మళ్ళీ షూటింగ్ కి రెడీ అవుతున్నారు.ఇప్పటికే కొంత మంది షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్లిపోయారు.

TeluguStop.com - Vakeel Saab Movie Shooting Started

మరికొంత మంది సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు.చిన్న సినిమాలు అయితే ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యాయి.

అయితే స్టార్ హీరోలు సినిమాలు కాస్తా ఆలస్యం అవుతున్నాయి.వీటిలో ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి భారీ సినిమాలు ఉన్నాయి.

TeluguStop.com - వకీల్ సాబ్ షూటింగ్ స్టార్ట్… అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ జాయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రభాస్ కూడా రాధేశ్యామ్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు.ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా షూటింగ్ మొదలైపోయింది.

ఇంకా ఈ సినిమా నెల రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది.ఈ నేపధ్యంలో ఈ షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు అన్ని అక్టోబర్ లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఇప్పట్లో షూటింగ్ కి వెళ్ళేది లేదని ముందు ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ దిల్ రాజు అభ్యర్ధన మేరకు తప్పనిసరి పరిస్థితిలో అక్టోబర్ లో షూటింగ్ కి రెడీ అవుతున్నాడు.అక్టోబర్ మొదటి వారంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్ లో జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తుంది.

ఆ లోపు సినిమాలోని కీలక సన్నివేశాలు అన్ని ఫినిష్ చేయడానికి వేణు శ్రీరామ్ షెడ్యుల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఇక పవన్ కళ్యాణ్ అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ లో పాల్గొంటే నెలాఖరుకి షూటింగ్ ఫినిష్ అయిపోతుంది.

వెంటనే గ్యాప్ లేకుండా డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని దిల్ రాజు అనుకుంటున్నట్లు బోగట్టా.

#Pawan Kalyan #Dill Raju #VakeelSaab #DirectorVenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vakeel Saab Movie Shooting Started Related Telugu News,Photos/Pics,Images..