వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ అన్ని కోట్లా..?  

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈరోజు సాయంత్రం వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుండగా ఈ టీజర్ తో వ్యూస్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

TeluguStop.com - Vakeel Saab Movie Satellite Rights Grabbed By Zee Telugu

పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఛానల్ జీ తెలుగు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.15 కోట్ల రూపాయల మొత్తానికి జీ తెలుగు ఈ సినిమా హక్కులు తీసుకున్నట్టు సమాచారం.ఈ మధ్య కాలంలో డిజిటల్ రైట్స్ వల్ల సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉండటంతో టీవీ ఛానెల్స్ లో సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు సైతం ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు రావడం లేదు.

TeluguStop.com - వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ అన్ని కోట్లా..-General-Telugu-Telugu Tollywood Photo Image

అందువల్ల గతంతో పోలిస్తే శాటిలైట్ రైట్స్ పై టీవీ ఛానెళ్లు ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయి.అయితే వకీల్ సాబ్ పై భారీగా అంచనాలు నెలకొనడం, పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమా హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.మొదట జెమినీ టీవీ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల ఆ ఛానెల్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే పలు సినిమాల నిర్మాతలు విడుదల తేదీలను ప్రకటిస్తుండగా ఈరోజు విడుదల కానున్న టీజర్ లో వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది.ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

.

#15 Crore Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు