ఈ బ్యూటీ కి ఫోటో షూట్లు తప్ప పెద్దగా సినిమా ఆఫర్లు లేవంటగా...

తెలుగులో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన అంజలి, నివేద థామస్, యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తదితరులకి మంచి క్రేజ్ వచ్చింది.

 Vakeel Saab Movie Fame Ananya Nagalla Waiting For Movie Offers-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో గిరిజన యువతి పాత్రలో నటించిన అనన్య నాగళ్ళ కి సోషల్ మీడియా మాధ్యమాలలో ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.దీనికి తోడు ఈ అమ్మడు ఆ మధ్య తన నడుము అందాలను చూపిస్తూ ఫోటో షూట్ చేయడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి వాటి కారణంగా ప్రస్తుతం ఈ అమ్మడికి క్రేజ్ బాగానే పెరిగింది.

అయితే ఈ విషయాన్ని గ్రహించిన అనన్య నాగళ్ళ ప్రస్తుతం వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొడుతుంది.కాగా ఇటీవలే ఈ అమ్మడు బాత్ టబ్ లో రోజా పూలు పరచి అందులో పడుకొని కొంటెగా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

 Vakeel Saab Movie Fame Ananya Nagalla Waiting For Movie Offers-ఈ బ్యూటీ కి ఫోటో షూట్లు తప్ప పెద్దగా సినిమా ఆఫర్లు లేవంటగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.అయితే ఇప్పటివరకు అనన్య నాగళ్ళ పెద్దగా టాలీవుడ్ చిత్రాల్లో నటించకపోయినప్పటికీ వకీల్ సబ్ చిత్రంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ వకీల్ సాబ్ చిత్రం తర్వాత ఈ అమ్మడు కి పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదని దాంతో అనన్య నాగళ్ళ ఫోటో షూట్లతో బిజీబిజీగా గా ఉంటోందని కొందరు చర్చించుకుంటున్నారు.ఏదేమైనప్పటికీ అందం అభినయం నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నటువంటి అనన్య నాగళ్ళకి తనను తాను హీరోయిన్ గా నిరూపించుకునేందుకు సరైన అవకాశం లభిస్తే కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనన్య నాగళ్ళ అధికారిక ఇంస్టాగ్రామ్ ని దాదాపుగా 5 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.అయితే ఈ మధ్య కాలంలో అనన్య తన ఫోటో షూట్లలలోని ఫోటోలు షేర్ చేయడం వల్ల రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ సంఖ్య పెరుగుతోంది.

#Vakeel Saab #Pawan Kalyan #VakeelSaab #Ananya Nagalla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు