వకీల్ సాబ్‌ డైరెక్టర్‌ తప్పటడుగులు.. ఐకాన్‌ విషయంలో తప్పు చేస్తున్నాడా?

పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా ను తెరకెక్కించి సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్.హిందీ పింక్ సినిమాకు వకీల్‌ సాబ్‌ రీమేక్ అనే విషయం తెలిసిందే.

 Vakeel Saab Movie Director Venu Sriram Next Movie, Venu Sriram, Vakeel Saab,icon-TeluguStop.com

పింక్ సినిమా ను పూర్తిగా మార్చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లు.పవన్ అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా మార్చి వకీల్ సాబ్ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తీసుకు వచ్చి సక్సెస్ అయ్యాడు.

రీమేక్ అని కొట్టి పారేసే విధంగా కాకుండా ఆ సినిమా ని మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.అందుకే ఆయన దర్శకత్వంలో వెంట వెంటనే స్టార్ స్టార్ హీరోలు మరియు సీనియర్ హీరోలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు.

కానీ అనూహ్యంగా ఆయన ఇప్పటి వరకు తన తదుపరి సినిమా మొదలు పెట్టలేదు.పవన్ తో సినిమా సక్సెస్ అయిన వెంటనే అల్లు అర్జున్ పిలిచి మరీ ఐకాన్ కి అవకాశం ఇస్తాడా అని అంతా భావించారు.

కానీ అల్లు అర్జున్ సినిమా ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశాలు కనిపించడం లేదు.

Telugu Allu Arjun, Icon, Pawan Kalyan, Ram Pothineni, Vakeel Saab, Venu Sriram-M

దాంతో దర్శకుడు వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమాను మరో హీరోతో చేసేందుకు సిద్ధమవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఈయన ఆ సినిమా ను చేస్తాడనే ప్రచారం జోరుగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.అయితే ఇప్పటికే లింగు స్వామి దర్శకత్వంలో రామ్‌ ఒక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వం చేసేందుకు ఇప్పటికే సైన్‌ చేశాడు.

కనుక వేణు శ్రీరామ్ కి డేట్లు ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఐకాన్ సినిమానే చెయ్యాలని పట్టుదలతో ఉన్న దర్శకుడు వేణు శ్రీరామ్ నిర్ణయాన్ని కొందరు అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు విశ్లేషకులు తప్పు పడుతున్నారు.

ఆయన ఇప్పటికైనా వెంటనే మరో సినిమాను మొదలు పెట్టాలని, స్టార్‌ హీరోల డేట్ల కోసం వెయిట్ చేయకుండా తన వద్ద ఉన్న ఇతర స్క్రిప్టు యంగ్ హీరోలతో లేదా కొత్త హీరోలతో సినిమాలు చేయాలని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు.సినిమాల ఎంపిక విషయంలో వేణు శ్రీరామ్ తప్పటడుగులు వేస్తూ ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube