వకీల్‌ సాబ్‌ నుండి వచ్చేది అది కాదు ఇది

పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే బర్త్‌ డే కామన్‌ డీపీ హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్విట్టర్‌ లో ప్రపంచ రికార్డును నమోదు చేసిన ఫ్యాన్స్‌ మరో రికార్డుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Vakeel Saab Movie Motion Poster On Pawan Kalyan Birthday, Pawan Kalyan Birthday,-TeluguStop.com

తమ రికార్డును తామే బ్రేక్‌ చేసుకునేందుకు ఏకంగా 24 గంటల్లో పది కోట్ల ట్వీట్స్‌ ను ప్లాన్‌ చేస్తున్నారట.ఈ విషయంలో ఇప్పటికే ప్రయత్నాలు మొదలు అయ్యాయి.

ఇక పవన్‌ బర్త్‌ డే రోజున వకీల్‌ సాబ్‌ టీజర్‌ వస్తుందని చాలా రోజులుగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

పరిస్థతి చూస్తుంటే టీజర్‌ లేదనిపిస్తుంది.

ఈ కరోనా సమయంలో షూటింగ్‌ ను నిలిపి వేసిన యూనిట్‌ సభ్యులు టీజర్‌ ను ఇప్పటి నుండే విడుదల చేయడం వల్ల సినిమా సమయానికి ప్రమోషన్‌ కు మెటీరియల్‌ ఉండదేమో అనుకుంటున్నారట.అందుకే ఇప్పుడు కేవలం మోషన్‌ పోస్టర్‌ మాత్రమే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

వకీల్‌ సాబ్‌ యూనిట్‌ సభ్యుల నిర్ణయం మెగా ఫ్యాన్స్‌ కు నిరాశ కలిగిస్తుంది.

Telugu Krish, Fans, Pawan Kalyan, September, Vakeel Saab, Vakeelsaab, Vakeelshah

ఇక పవన్‌ ఫ్యాన్స్‌ ఆశించిన క్రిష్‌ మూవీ అప్‌ డేట్‌ కూడా రాకపోవచ్చు అంటున్నారు.ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా షూటింగ్‌ కూడా మొదలు పెట్టలేదు.వచ్చే ఏడాది ఆరంభంకు షూటింగ్‌ను మొదలు పెడతారట.

అప్పటి వరకు పవన్‌ కెమెరా ముందుకు రావడం లేదు.ఇలాంటి సమయంలో ఇప్పటి నుండే అప్‌ డేట్‌ లేదా పోస్టర్‌ ను ఎలా విడుదల చేస్తామన్నట్లుగా క్రిష్‌ ఉన్నాడు.

పవన్‌ ఫ్యాన్స్‌ కు ఈ సారి కేవలం వకీల్‌ సాబ్‌ మోషన్‌ పోస్టర్‌ మినహా మరే ప్రత్యేకమైన బహుమానాలు లేవని క్లారిటీ వచ్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube