'వకీల్ సాబ్' లో పవన్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుసా..!

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా రాబోతున్న వకీల్ సాబ్ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ వచ్చింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడు చూద్దామా అన్నట్టు పవన్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Vakeel Saab Introduction Scene Starts With Fight, Vakeel Saab, Introduction Scen-TeluguStop.com

ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ వీర లెవల్లో ఇస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

పవన్ సినిమా అంటే మాములు విషయమా అందులో పవన్ మూడేళ్ళ తర్వాత వెండితెరపై కనిపించబోతున్నాడు అందుకే పవన్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ గురించి అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.

ఈ సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ ఫైట్ తో మొదలవుతుందని టాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Telugu Scene, Pawan Kalyan, Vakeel Saab-Latest News - Telugu

ఈ సీన్ లో ఒక ఇంట్లో సమానులతోపాటు వివేకానందుడి ఫోటో కూడా పడేయబోతుంటే అప్పుడు పవన్ ఆ ఫోటోని పట్టుకుని ఆ తర్వాత ఫైట్ చేస్తాడని విపరీతంగా టాక్ నడుస్తుంది.అయితే ఒరిజినల్ పింక్ సినిమాలో అసలు ఫైట్స్ ఉండవు.కానీ ఈ సినిమాలో మాత్రం నాలుగైదు ఫైట్స్ ఉన్నట్టు సమాచారం.

మరి ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి ఉండాల్సిందే.

వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube