ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి వకీల్ సాబ్ రెడీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత తెరపై కనిపించిన సినిమా వకీల్ సాబ్.పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

 Vakeel Saab Digital Release Date Fixed-TeluguStop.com

ఫ్యాన్స్ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.మహిళల నుంచి విశేషమైన ఆదరణ వస్తుంది.

రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమాలకి భిన్నంగా మహిళల ఇతివృత్తంగా ఈ సినిమా రావడం.మహిళల సమస్యల మీద పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పాత్రలో వాదించడం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది.

 Vakeel Saab Digital Release Date Fixed-ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి వకీల్ సాబ్ రెడీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.ఒరిజినల్ చిత్రానికి మించి ఈ సినిమాకి ఆదరణ వస్తూ ఉండటం విశేషం.

ఇదిలా ఉంటే ఇప్పటికే థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి.ఏపీలో వకీల్ సాబ్ సినిమా ప్రదర్శనకి అధికార పార్టీ నుంచి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్న ఓవరాల్ గా మాత్రం సినిమాని కొనుక్కున్న డిస్టిబ్యూటర్స్ అందరికి లాభాలు తీసుకొచ్చేలా ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని థియేటర్ లో కాకుండా డైరెక్టర్ గా డిజిటల్ రిలీజ్ కోసం అమెజాన్ ఏకంగా వంద కోట్లు ఆఫర్ చేసింది.అయితే పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ స్పందనే వేరుగా ఉంటుంది.

ఈ నిర్మాత దిల్ రాజు ఊహించినట్లుగానే మంచి స్పందన వస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ కి ఇప్పటికే అమ్మేయడంతో డిజిటల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసేశారు.

ఏప్రిల్ 23న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు.థియేటర్స్ లో వచ్చినట్లే అమెజాన్ లో కూడా వకీల్ సాబ్ కి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

.

#Amazon Prime #Pawer Star #Dil Raju #Venu Sriram #VakeelSaab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు