పవన్ సినిమాలో విషాదం.. ఫ్యాన్స్ తీసుకుంటారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ అనే చిత్రంతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మరో రెండు సినిమాలను ఇప్పటికే లైన్‌లో పెట్టాడు.

 Sad Ending In Pawan Kalyan Movie, Pawan Kalyan, Pspk27, Krish, Jacqueline Fernan-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌గా క్రిష్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలో విషాదకరమైన అంశం ఒకటి ఉంటుందని, అది ప్రేక్షకులచే కన్నీళ్లు పెట్టిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమా సెకండాఫ్‌లో హీరోయిన్ జాక్వెలిన్ ఫర్నాండెజ్ మరణిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో జాక్వెలిన్ ఓ యువరాణి పాత్రలో నటిస్తుందట.ఈ క్రమంలో రాజు అయిన ఆమె సోదరుడితో పవన్ తలపడేటప్పుడు యువరాణి అడ్డంగా వెళ్లడంతో ఆమె మరణించనున్నట్లు తెలుస్తోంది.

సెకండాఫ్‌లో ఈ సీన్ ఉంటుందని, మరి ప్రేక్షకులు ఈ సీన్‌ను ఎంతమేర ఆదరిస్తారా అనే సందేహం చిత్ర వర్గాల్లో నెలకొంది.విరూపాక్ష అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీలో రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్ నటించనున్నట్లు తెలుస్తోంది.

మొఘల్ మరియు బ్రిటీష్ కాలం నాటి కథతో ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది.పవన్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అటు వకీల్ సాబ్ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు.ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి వకీల్ సాబ్ చిత్రంతో పవన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube