ఐఏండిబిలో ఆ రెండు సినిమాలని బీట్ చేసిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది.

 Vakeel Saab Beats Pink Nerkonda Paarvai In Imdb Rating-TeluguStop.com

అలాగే నిర్మాత దిల్ రాజు కలని నెరవేర్చింది.దర్శకుడు వేణుశ్రీరామ్ కి స్టార్ ఇమేజ్ అందించింది.

ఓవరాల్ గా ఈ మూవీ ప్రేక్షకులని కూడా మెప్పించింది.దీంతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవడంతో పాటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి ప్రశంసలు సొంతం చేసుకుంది.

 Vakeel Saab Beats Pink Nerkonda Paarvai In Imdb Rating-ఐఏండిబిలో ఆ రెండు సినిమాలని బీట్ చేసిన వకీల్ సాబ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు.వీటిలో రెండు ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిపోయి షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే వకీల్ సాబ్ హిందీలో అమితాబచ్చన్ నటించిన పింక్ మూవీకి రీమేక్ అన్న విషయం అందరికి తెలిసిందే.హిందీలో పింక్ డీసెంట్ హిట్ గా నిలిచింది.

Telugu Dil Raju, Imdb Rating, Nerkonda Paarvai, Pawan Kalyan, Pink, Tollywood, Vakeel Saab, Venu Sriram-Movie

దీనిని తమిళ్ లో అజిత్ హీరోగా నెర్కొండ పార్వాయి టైటిల్ తో రీమేక్ అయ్యి అక్కడ కూడా హిట్ అయ్యింది.ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఐఏండిబి రేటింగ్స్ లో వకీల్ సాబ్ మూవీ ఒరిజినల్ వెర్షన్ తరువాత వచ్చిన నెర్కొండ పార్వాయిలని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలబడటం విశేషం.అమితాబ్ పింక్ మూవీకి ఐఏండిబిలో 75.5 రేటింగ్స్ వస్తే అజిత్ నెర్కొండ పర్వాయికి 73.4 రేటింగ్స్ వచ్చింది.అయితే వకీల్ సాబ్ మూవీ మొత్తం ఏకంగా 84.4 రేటింగ్ సొంతం చేసుకొని టాప్ లో నిలబడటం విశేషం.దీనిని బట్టి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో నటించడం వలన సినిమాకి ఏ రేంజ్ లో హైప్ వచ్చిందో అర్ధమవుతుంది.అలాగే ఆ రెండు సినిమాలని మించి ప్రజాదారణని వకీల్ సాబ్ సొంతం చేసుకుందని స్పష్టం అవుతుంది.

#Venu Sriram #IMDB Rating #Vakeel Saab #Dil Raju #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు