టీజర్ టాక్ : మెగా హీరో రంగ రంగ వైభవంగా రాబోతున్నాడు

ఉప్పెన సినిమా తో టైటిల్ కు తగ్గట్లుగా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్స్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్.చిరంజీవి స్టైల్ మరియు పవన్ కళ్యాణ్‌ మార్క్‌ మ్యానరిజం లను కలిగి ఉన్న వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.

 Vaisshnav Tej Ketika Sharma Ranga Ranga Vaibhavanga Teaser , Devi Sri Prasad, Ke-TeluguStop.com

కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు తమిళ అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడు గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నాడు.సినిమా విడుదలకు సిద్ధం అవుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమా ను చాలా కూల్‌ అండ్‌ నీట్‌ గా ఒక మంచి ఫ్యామిలీ కమ్‌ యూత్ ఫుల్‌ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.

హీరోగా ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కు కమర్షియల్‌ బ్రేక్ ను తెస్తుందనే నమ్మకం ను మెగా కాంపౌండ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన హడావుడి సాగుతున్న సమయంలోనే తాజాగా టీజర్‌ ను విడుదల చేశారు.

ఇదో కొత్త తరహా ప్రేమ కథ అన్నట్లుగా టీజర్‌ ను చూస్తుంటే అర్థం అవుతోంది.హీరో హీరోయిన్ కు మాటలు ఉండవు.ఇద్దరు కూడా ఒకరు అంటే ఒకరికి చాలా ప్రేమ.అంతే కాకుండా ఒకరు అంటే ఒకరికి కోపం ఉంటుంది.

అందువల్ల ఈగోతో మాట్లాడుకోరు.అయినా కూడా ప్రేమించుకుంటూ ఉంటారు.

ఆ ప్రేమ ఎక్కడికి దారి తీస్తుంది.అసలు ఇలాంటి ప్రేమ ఏంటీ అనే విషయాలను తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ను దసరా కు కాస్త అటు ఇటుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.వైష్ణవ్‌ తేజ్ లుక్ విషయంలో అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు.

ఖచ్చితంగా వైష్ణవ్ కు మంచి సక్సెస్ దక్కుతుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube