‘కొండపొలం’మూవీతో వైష్ణవ్ తేజ్ ఏం సాధించాడంటే..?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ హీరోల్లో ఇప్పటివరకు ఎవరికీ దక్కని క్రెడిట్ వైష్ణవ్ తేజ్‌ వశమైంది.తొలి సినిమాతోనే ఇండియా వైడ్ సుమారు రూ.100 కోట్లకు చేరువలో కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు వైష్ణవ్.ఉప్పెన సినిమాతో వైష్ణవ్ ‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Vaishnav Tej What Gain After Doing Konda Polam Movie-TeluguStop.com

ఈ మూవీతో సౌత్ ఇండియాలోనే కలెక్షన్ల పరంగా ఎవరూ సాధించలేని రికార్డును తొలి సినిమాతోనే కైవసం చేసుకున్నాడు.అంతేకాకుండా, ఉప్పెన సినిమాలో తన నటనకు గాను మంచి మార్కులే వచ్చాయి.

అయితే, రెండవ సినిమా అంతకు మించి ఉండాలని ఫ్యాన్స్ భావించారు.కానీ వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం వంటి ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Vaishnav Tej What Gain After Doing Konda Polam Movie-‘కొండపొలం’ మూవీతో వైష్ణవ్ తేజ్ ఏం సాధించాడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొండపొలం మూవీ విడుదలయ్యాక విమర్శకుల నుంచి మంచి టాక్ దక్కించుకుంది.ఒక మంచి మెసేజ్‌‌ను దర్శకుడు క్రిష్ ఇచ్చాడని ప్రేక్షకులు చెబుతున్నారు.కానీ, వసూళ్ల విషయంలో మాత్రం కొంత వెనుకబడింది.కానీ, ఉప్పెన వంటి హిట్ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ నుంచి ఆ రేంజ్‌లో కమర్షియల్ మూవీని ఆశించినా.

మెగా అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.తొలి సినిమాకు సుమారు రూ.100 కోట్ల చేరువలో కలెక్షన్లు రాబట్టిన వైష్ణవ్ తేజ్.కొండపొలం సినిమాకు కనీసం రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా రాబట్టలేకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telugu 100 Crores Collections, Director Girishayya, Director Krish, Kondapolam Movie, Mega Fans, Rakul Preet Singh, Uppena, Vaishnav Tej, Vaishnav Tej Third Movie-Movie

ఉప్పెన తర్వాత కొండపొలం మూవీ వైష్ణవ్ తేజ్‌కు మంచి గుర్తింపు తీసుకొస్తుందని సినీ వర్గాల టాక్.హీరోలు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయకూడదు.అన్ని పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి.

అదే పని ఇప్పుడు కొండపొలం మూవీతో వైష్ణవ్ నిరూపించుకున్నాడని క్రిటిక్స్ చెబుతున్నారు.కలెక్షన్లు రాకపోయినా నటుడిగా కొండపొలం సినిమా వైష్ణవ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిందని తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం అర్జున్ రెడ్డి సహాయ దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ మూడో సినిమా తెరకెక్కుతోంది.

#Fans #Vaishnav Tej #Krish #Uppena #Kondapolam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు