ఉప్పెన టీజర్ టాక్: దేవిశ్రీ మ్యూజిక్‌తో మ్యాజిక్!  

మెగా కాంపౌండ్ నుండి కొత్తగా వస్తున్న హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ గతేడాదే రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కోరనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఉప్పెన చిత్ర రిలీజ్‌ను వాయిదా వేశారు.

TeluguStop.com - Vaishnav Tej Uppena Teaser Talk

ఇక ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అవుతుందేమో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.కానీ ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

ఇక తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

TeluguStop.com - ఉప్పెన టీజర్ టాక్: దేవిశ్రీ మ్యూజిక్‌తో మ్యాజిక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

టీజర్ ఆద్యాంతం ఫీల్ గుడ్ రొమాంటిక్‌గా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఇక ఈ టీజర్‌లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను చాలా అందంగా చూపించాడు దర్శకుడు బుచ్చిబాబు సానా.ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్ల ప్రేమకు ఎలాంటి అడ్డంకి ఏర్పడింది, వారు దాన్ని ఎలా ఎదురించారు అనేది చిత్ర కథగా ఉండబోతుంది.ఈ సినిమాకు కథను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఉప్పెన టీజర్‌కు ప్రాణం పోసింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.ఫీల్ గుడ్ మ్యూజిక్‌గా దేవిశ్రీ అందించిన పాటలతో పాటు బీజీఎం కూడా ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాతో హీరో వైష్ణవ్ తేజ్ అదిరిపోయే సక్సెస్ అందుకుంటాడని, ఈ సినిమా ఆయన కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

హీరోయిన్‌గా కృతి శెట్టి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిందని, ఆమె పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ అందమైన ఉప్పెన టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

#Uppena #Kriti Shetty #Devisri Prasad #Sukumar #Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు