ఉప్పెన హీరో మూడవ సినిమా టైటిల్‌, పోస్టర్ ఇదుగో

Vaishnav Tej Third Movie Title Ranga Ranga Vaibhavamga

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సాధించాడు.ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన ఏ మెగా హీరోకి… ఏ తెలుగు హీరోకి దక్కని అరుదైన రికార్డును వైష్ణవ్ తేజ్ దక్కించుకున్నాడు.

 Vaishnav Tej Third Movie Title Ranga Ranga Vaibhavamga-TeluguStop.com

వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే వంద కోట్ల వసూళ్ళ క్లబ్‌ లో జాయిన్ అయ్యాడు.ఉప్పెన సినిమా వంద కోట్లు వసూలు చేసి మొదటి సినిమాతోనే కెరీర్‌ ను టాప్ లో ఉంచింది.

మొదటి సినిమా ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో ఈ మెగా హీరో సినిమా చేయడం జరిగింది అదే కొండపొలం.

 Vaishnav Tej Third Movie Title Ranga Ranga Vaibhavamga-ఉప్పెన హీరో మూడవ సినిమా టైటిల్‌, పోస్టర్ ఇదుగో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Kondapolam, Rangaranga, Uppena, Vaishna Tej-Movie

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొండపొలం సినిమా కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.కానీ ఆ సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కాయి.వైష్ణవ్ తేజ్ కొండ పొలంలో ఒక మెచ్యూరిటీ గల నటుడిగా రివ్యూలు వచ్చాయి.

భారీ ఎత్తున అంచనాలున్న కొండపొలం సినిమా నిరాశపరిచినా కూడా ఆయన తదుపరి సినిమాపై అంతకు మించిన ఆశలు ఉన్నాయి.వైష్ణవ్ తేజ్ మూడో సినిమాకు గిరీశయ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈయన తెలుగు అర్జున్ రెడ్డి ని తమిళంలో రీమేక్ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.గురువుకు తగ్గ శిష్యుడు అన్నట్లుగా అర్జున్ రెడ్డి తమిళ వర్షన్‌ తో అక్కడ విజయాన్ని దక్కించుకోవడంతో తాజా చిత్రంపై అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు సమాచారం అందుతోంది.ఈ సంక్రాంతి సందర్భంగా సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు.

సినిమాకు రంగ రంగ వైభవంగా అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ప్రకటించారు.ఈ సినిమాలో రొమాంటిక్ హీరోయిన్ కేతికశర్మ, వైష్ణవ్ తేజ్ కు జోడీగా నటించింది.

వీరిద్దరి మధ్య క్యూట్ లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాకు ప్లస్‌ అవుతాయని అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు.వైష్ణవ్ తేజ్ మూడో సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమంటూ యూనిట్ వర్గాల వారు మరియు మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా మెగా ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహంను నింపుతుందేమో చూడాలి.

#RangaRanga #Uppena #Kondapolam #Vaishna Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube