వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా ప్రకటన ఎప్పుడు?  

Vaishnav Tej Second Movie - Telugu Chiranjeevi Birthday, Megahero, Ott Platform, Uppena Movie, Vaishnav Tej

మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్స్‌ చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఉప్పెన చిత్రంతో పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే.ఉప్పెన సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

 Vaishnav Tej Second Movie

సినిమా ఓటీటీలో విడుదల అవ్వనుందా, థియేటర్లలో విడుదల కాబోతుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.ఆ విషయం పక్కన పెడితే వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా గురించిన చర్చ అప్పుడే మొదలైంది.
ఉప్పెన సినిమా విడుదల అయ్యేది ఎప్పుడో తెలియదు.కాని రెండవ సినిమా విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని మెగా ఫ్యామిలీ భావిస్తుంది. వైష్ణవ్‌ తేజ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక మంచి కథను రెడీ చేయించినట్లుగా తెలుస్తోంది.ఆకథ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి వినబోతున్నాడు.

మొదటి సినిమాలో డీ గ్లామర్‌గా కనిపించిన వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాలో మాత్రం స్టైలిష్‌ స్టార్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా ప్రకటన ఎప్పుడు-Movie-Telugu Tollywood Photo Image

యంగ్‌ డైరెక్టర్‌ ఈ మెగా మూవీకి డైరెక్షన్‌ చేయబోతున్నాడు.వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాలో స్టైలిష్‌ లుక్‌తో కనిపించడంతో పాటు అద్బుతమైన డాన్స్‌ ప్రతిభను కూడా కనబర్చబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టులో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాను పవన్‌కు సన్నిహితుడు అయిన రామ్‌ తాళ్లూరి నిర్మించబోతున్నాడట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vaishnav Tej Second Movie Related Telugu News,Photos/Pics,Images..