ఆ హీరో సలహాల వల్లే అలా నటించా : వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో తొలి నటనలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రస్తుతం ఒక రేంజ్ లో క్రేజీ ను సంపాదించుకున్నారు.ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అంతేకాకుండా రూ.100 కోట్ల వసూళ్లతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించిన బుచ్చిబాబు సన మాత్రం మొదటిసారి దర్శకత్వంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Vaishnav Tej Reveals Charan Anna Gave Tips Me Movie Shooting-TeluguStop.com

ఇక ఈ సినిమా భారీ విజయం అందించినందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి, మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా టీమ్ కు గిఫ్ట్ లు కూడా అందాయి.

ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నటులు వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంటున్నారు.ఈ సినిమా విజయం తరువాత మూవీ టీం మొత్తం సక్సెస్ మీట్ లో తెగ పాల్గొంటున్నారు.

 Vaishnav Tej Reveals Charan Anna Gave Tips Me Movie Shooting-ఆ హీరో సలహాల వల్లే అలా నటించా : వైష్ణవ్ తేజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో కృతి శెట్టి డైలాగులు, తన అందం అభిమానులను ఆకట్టుకోగా వైష్ణవి తేజ్ కనుబొమ్మల ఎక్స్ ప్రెషన్స్ మాత్రం తల తిప్పకుండా చేశాయని చెప్పవచ్చు.ఇక వైష్ణవ్ తేజ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత మరో ఇంటర్వ్యూలో పాల్గొన్నగా తనకు ఓ స్టార్ హీరో ఇచ్చిన సలహా వల్లే అలా నటించానని తెలిపారు.

Telugu Ram Charan, Tollywood, Uppena, Vaishnav Tej-Movie

వైష్ణవ్ తేజ్ బావ రామ్ చరణ్ ఈ సినిమా ముందు తనకు ఓ సలహా ఇచ్చాడట.రామ్ చరణ్ వైష్ణవ్ తేజ్ నటించిన మూవీ లో తన కనుబొమ్మలను వీలైనంత ఉపయోగించమని తెలిపారట.అలా చేస్తే సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుందని అంతేకాకుండా సినిమా సక్సెస్ కు బాగా ఉపయోగపడుతుందని తెలిపారట.

అంతేకాకుండా రామ్ చరణ్ కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడగా వైష్ణవ్ తేజ్ ను తన నాన్న, బాబాయ్ సినిమాల్లోకి రమ్మని ఎంతో ప్రోత్సహించారని తెలిపాడు.

ఇదియే కాకుండా పవన్ కళ్యాణ్ వైష్ణవ్ తేజ్ ను నటన పట్ల ఆసక్తి పెంచేందుకు విదేశాలకు కూడా పంపించాడని తెలిపాడు.

#Vaishnav Tej #Ram Charan #Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు