వైష్ణవి తేజ్ తో మరో దర్శకుడు.. కథ కూడా ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, ఉప్పెన సినిమా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.తన తొలి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్నాడు.

 Vaishnav Tej Next Movie With Venky Kudumula-TeluguStop.com

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలంతా తమ తొలి నటనతోనే మంచి గుర్తింపు అందుకున్న సంగతి తెలిసిందే.ఇక సాయి ధరమ్తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ కూడా.

బాలనటుడి నుండి హీరోగా మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు.

 Vaishnav Tej Next Movie With Venky Kudumula-వైష్ణవ్ తేజ్ తో మరో దర్శకుడు.. కథ కూడా ఫిక్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుజ్జి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పెన.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి కూడా తొలిసారిగా హీరోయిన్ గా పరిచయం అయింది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మంచి ప్రేమ కథ ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా తర్వాత కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు లతో పలువురు సినిమాల అవకాశం కోసం ఆఫర్లు కూడా చేశారు.

ఇక ఇప్పటికే కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇక వైష్ణవ్ తేజ్ కూడా మరో సినిమాకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.

Telugu Next Movie, Tollywood, Vaishnav Tej, Venky Kudumula-Movie

ఇటీవలే విడుదలైన భీష్మ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల.ఈయన తన తర్వాతి సినిమాను మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో తియ్యాలని స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడట.అంతేకాకుండా వరుణ్ కి కథను కూడా వినిపించాడట.కానీ వరుణ్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఏడాది సమయం పడుతుందని అన్నాడట వరుణ్.

ఇక వెంకీ అంతలోపు ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.అదికూడా వైష్ణవ్ తేజ్ తోనే చెయ్యాలని స్క్రిప్టు కూడా సిద్ధం చేశాడట.

ఇక వైష్ణవ్ కూడా ఈ కథ విని నచ్చిందని అనడంతో అన్ని కుదిరితే దసర లోపే ఈ సినిమాని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట వెంకీ.

#Venky Kudumula #Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు