పవన్ డైరక్టర్ తో వైష్ణవ్ తేజ్..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతోనే సూపర్ హిట్ అందుకోగా ఆ సినిమా తర్వాత వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు వైష్ణవ్ తేజ్.క్రిష్ డైరక్షన్ లో కొండపొలం తో పాటుగా గిరీశయ్య డైరక్షన్ లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

 Vaishnav Tej Movie With Pawan Panja Movie Director-TeluguStop.com

ఈ సినిమాలతో పాటుగా కొత్తగా పంజా ఫేమ్ విష్ణు వర్ధన్ డైరక్షన్ లో కూడా ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.పవర్ స్టార్ తో పంజా సినిమా చేసిన విష్ణు వర్ధన్ ఆ సినిమా తర్వాత కనిపించలేదు.
చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో షేర్ష సినిమాతో సత్తా చాటాడు విష్ణు వర్ధన్.ఈమధ్యనే అమేజాన్ ప్రైం లో రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాతో మరోసారి విష్ణు వర్ధన్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు.

 Vaishnav Tej Movie With Pawan Panja Movie Director-పవన్ డైరక్టర్ తో వైష్ణవ్ తేజ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  షేర్ష రిలీజ్ కు ముందే విష్ణు వర్ధన్ వైష్ణవ్ తేజ్ సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తారని టాక్. వైష్ణవ్ తేజ్ సినిమాల సెలక్షన్ చూస్తుంటే ఇతను కూడా మిగతా మెగా హీరోల లానే తనకంటూ ఒక సెపరేట్ స్టార్ డం తెచ్చుకుంటాడని ఫిక్స్ అవ్వొచ్చు.

#Vishnu Vardhan #Vishnu Vardhan #Amazon Prime #VaishnavTej #Mega

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు