వైష్ణవ్ తేజ్ క్రిష్ సినిమా కి ఈసారి వర్షం అడ్డంకి  

Vaishnav Tej Krish movie shooting stopped due to rain, Tollywood, Telugu Cinema, Mega Hero, Rakul Preet Singh, Director Krish, - Telugu Director Krish, Mega Hero, Rakul Preet Singh, Telugu Cinema, Tollywood

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగేట్రం చేస్తున్న వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు.ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ట్రైబల్ స్టొరీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అటవీప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి జరుగుతుంది.

TeluguStop.com - Vaishnav Tej Krish Movie Shooting Stoped Due To Rain

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది.ఆమె లుక్ కి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి.

TeluguStop.com - వైష్ణవ్ తేజ్ క్రిష్ సినిమా కి ఈసారి వర్షం అడ్డంకి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీనిని బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం అర్ధమైంది.ఇదిలా ఉంటే ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో ఏకదాటిగా పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ భావించారు.

అయితే సినిమా ప్రారంభించినప్పటి నుంచి షూటింగ్ కి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.షూటింగ్ ప్రారంభించే దశలో చిత్ర యూనిట్ లో కొంత మంది కరోనా భారిన పడ్డారు.

***

దీంతో మళ్ళీ వాయిదా వేసి షెడ్యూల్ ఖరారు చేయాల్సి వచ్చింది.

ఇక తాజాగా షూటింగ్ మొదలు పెట్టి రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు.

అయితే ప్రస్తుతం అనంతగిరి కొండల మీద, వికారాబాద్ పరిసర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ సినిమా షూటింగ్‌కు ఆటంకం ఏర్పడింది.షూటింగ్ స్పాట్‌ను వరద నీరు ముంచెత్తినట్టు తెలుస్తోంది.

కుండపోత వర్షం కారణంగా షూటింగ్ జరిపే వీలు లేకపోవడంతో ప్యాకప్ చెప్పేసి చిత్రయూనిట్ హైదరాబాద్ చేరుకుందని తెలుస్తుంది.మరల వర్షం తక్కుముఖం పట్టి వరదనీరు పోయాక షూటింగ్ ప్లాన్ చేయడం లేదంటే వేరొక లొకేషన్ కి వెళ్ళిపోవడం చేయాలని చూస్తున్నారు.

ఇప్పుడు క్రిష్ టీమ్ లొకేషన్ వేటలో ఉందని తెలుస్తుంది.మొత్తానికి వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కరోనా రూపంలో రిలీజ్ కి ఆటంకం ఏర్పడగా, ఇప్పుడు రెండో సినిమా షూటింగ్ లోనే అవాంతరాలు రావడం గమనార్హం.

#Director Krish #Mega Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vaishnav Tej Krish Movie Shooting Stoped Due To Rain Related Telugu News,Photos/Pics,Images..