వైష్ణవ్ 'కొండపొలం' కు ఊహించని సమస్య !

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.ఉప్పెన హిట్ తో ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.

 Vaishnav Tej Krish Movie Latest Updates-TeluguStop.com

కరోనా తర్వాత టాలీవుడ్ ను మళ్ళీ కోలుకునేలా చేసిన సినిమాల లిస్టులో ఉప్పెన కూడా ఉంది.తొలి సినిమాతోనే 100 కోట్ల మార్క్ అందుకున్న ఘనత కూడా వైష్ణవ్ తేజ్ కే దక్కింది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు.ఇందులో నటించిన హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది.

 Vaishnav Tej Krish Movie Latest Updates-వైష్ణవ్ కొండపొలం’ కు ఊహించని సమస్య -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉప్పెన భారీ హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Kondapolam Movie, Krish, Rakul Preet Singh, Tollywood, Vaishnav Tej, Vaishnav Tej Krish Movie Latest Updates-Movie

ఈ సినిమా ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమాకు ఊహించని సమస్య ఎదురైంది.అడవి నేపథ్యంగా సాగే ఈ కథలో ఆ వాతావరణాన్ని సృష్టించడానికి వి ఎఫ్ ఎక్స్ చాలా అవసరం.అయితే ఇప్పుడు ఈ వి ఎఫ్ ఎక్స్ వల్లే ఈ సినిమాకు ఒక సమస్య వచ్చిందట.

ఈ విఎఫ్ ఎక్స్ పనులలో 80 శాతం ఇంకా పెండింగ్ లోనే ఉందట.

ఈ డిసెంబర్ వరకు కూడా ఈ పనులు పూర్తి చేయలేమని సదరు వి ఎఫ్ ఎక్స్ కంపనీ చేతులెత్తేసింది.

దీంతో ఇప్పట్లో ఈ సినిమా విడుదల అవ్వడం కష్టం గానే కనిపిస్తుంది.అయినా ఇప్పుడు కరోనా కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా లేనందున క్రిష్ కూడా వారికీ తగిన సమయం ఇచ్చాడని తెలుస్తుంది.

కేవలం 45 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన క్రిష్ కు ఇప్పుడు ఇలా సమస్య ఎదురైంది.చూడాలి మరి ఈ సమస్యలను దాటుకుని ఈ సినిమా ఎప్పుడుకు విడుదల అవుతుందో.

#Vaishnav Tej #VaishnavTej #Krish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు