'కొండపొలం'లో వైష్ణవ్ రకుల్ పాత్రలు ఇలా ఉండబోతున్నాయట !

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.ఉప్పెన హిట్ తో ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ హీరో అయి పోయాడు.

 Hero Vaishnav Tej Krish Kondapolam Movie Latest Update, Krish, Vaishnav Tej, Kon-TeluguStop.com

తొలి సినిమాతోనే 100 కోట్ల మార్క్ అందుకున్న ఘనత కూడా వైష్ణవ్ తేజ్ కే దక్కింది.తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ తన కెరీర్ ను జాగ్రత్తగా మలచు కుంటున్నాడు.

ప్రస్తుతం వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదల కోసం వేచి ఉంది.కరోనా కారణంగా ఇన్ని రోజులు ఈ సినిమాను విడుదల చేయలేక పోయారు.

ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చెయ్యాలా.లేదంటే థియేటర్స్ లో విడుదల చేయాలా అని క్రిష్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాను కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కించారు.

Telugu Kondapolam, Krish, Latest, Rakul Role, Tollywood, Vaishnav Tej, Vaishnavt

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో తేజ్ గొర్రెల కాపరిగా నటిస్తుండగా.రకుల్ లాయర్ పాత్రలో కనిపించ బోతుంది.

మరి క్రిష్ సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.వాస్తవానికి దగ్గరగా ఉంటాయి.

ఈ సినిమాలో కూడా క్రిష్ మేకింగ్ వాస్తవానికి దగ్గరగా కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు టాక్ వినిపిస్తుంది.

Telugu Kondapolam, Krish, Latest, Rakul Role, Tollywood, Vaishnav Tej, Vaishnavt

అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.ఈ సినిమాలో రకుల్ పాత్ర తాజ్ పాత్రకు సపోర్టింగ్ గా ఉంటుందని.రకుల్ పాత్ర కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఈ సినిమాతోనే వైష్ణవ్ హీరోగా పరిచయం అవ్వాల్సి ఉండగా అనూహ్యంగా ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఏది ఏమైనా ఈ సినిమా కూడా తేజ్ కెరీర్ లో ఒక మైలురాయి లాగా నిలిచి పోతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇక ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube