'కొండపొలం' ట్రైలర్ దుమ్మురేపుతుందిగా!

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన తోనే సూపర్ హిట్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఈ సినిమా సూపర్ హిట్ అవవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.

 Vaishnav Tej Kondapolam Trailer Create Record In Youtube-TeluguStop.com

కానీ వైష్ణవ్ తేజ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ తన కెరీర్ ను జాగ్రత్తగా మలచు కుంటున్నాడు.ప్రస్తుతం వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలంసినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదల కోసం వేచి ఉంది.ఈ సినిమా ఉప్పెన కంటే ముందే విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఉప్పెన సినిమా ముందు విడుదల అయ్యింది.

 Vaishnav Tej Kondapolam Trailer Create Record In Youtube-కొండపొలం’ ట్రైలర్ దుమ్మురేపుతుందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కించారు.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో తేజ్ గొర్రెల కాపరిగా నటిస్తుండగా.రకుల్ లాయర్ పాత్రలో కనిపించ బోతుంది.ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది.ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల చేసింది.ఈ సినిమా ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

అడవి బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ సన్నివేశాలతో పక్కా గ్రామీణ నేపథ్యంలో విడుదల అయినా ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టు కుంటుంది.యూట్యూబ్ లో ఈ ట్రైలర్ దుమ్ము రేపుతోంది.

ఇప్పటికే 3 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకు పోతుంది.ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

మరి చూడాలి ఈ సినిమా విడుదల అయినా తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.

#Vaishnav Tej #VaishnavTej #Krish #Kondapolam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు