కొండపొలం రివ్యూ: అడవి నేర్పే పాటలు అదుర్స్

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కొండపొలం. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటీనటులుగా నటించారు.ఉప్పెన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో ఎటువంటి సక్సెస్ ను అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

 Vaishnav Tej Kondapolam Movie Review And Rating, Vaishnav Tej , Tollywood, Movi-TeluguStop.com

కథ:

వైష్ణవ్ తేజ్ రవీంద్ర యాదవ్ అనే కడప జిల్లాకు చెందిన పాతికేళ్ల కుర్రాడిగా నటిస్తాడు.ఇక తను బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు.ఇక హైదరాబాద్ లో బతకడం తనకు కష్టంగా మారడంతో తన ఊరికి వెళ్లడంతో తన తాత రోశయ్య (కోట శ్రీనివాస్ రావు) తనకు సలహా ఇస్తాడు.

ఊర్లో ఉన్న గొర్రెల మందతో కొందరు కరువు వల్ల కొండపొలం చేస్తున్నారని తమ గొర్రెలను కూడా తీసుకొని నల్లమల అడవికి వెళ్ళమని సలహా ఇస్తాడు.ఇక అక్కడికి వెళ్ళిన రవీంద్ర యాదవ్ అక్కడ కొన్ని రోజులు ఉండటంతో అక్కడ తాను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటాడు.

తనలో ఎంతో మార్పు వస్తుంది.అక్కడ కొన్ని కొత్త పాఠాలు నేర్చుకుంటాడు.దాంతో అక్కడి నుంచి తనకు ఎదురైన కష్టాల నుండి ఎలా బయట పడతాడో అదే మిగిలిన కథ.

నటినటుల నటన:

వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోశాడు.తన కంటి చూపుతోనే చాలా భావాలు తెలిపాడు.ఇందులో పిరికివాడిగా ఉన్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత పట్టుదలతో శ్రమించే విధానం బాగా ఆకట్టుకుంది.ఇక రకుల్ ప్రీత్ తన పాత్రతో కాస్త వైష్ణవ్ తేజ్ ను డామినేట్ చేసింది.మిగతా నటీనటులందరూ తమ పాత్రలతో బాగా మెప్పించారు.

టెక్నికల్:

ఈ సినిమాకు కథ, పాటలు అద్భుతంగా అందించారు.కొన్ని డైలాగులు మనసును తాకే విధంగా ఉన్నాయి.కీరవాణి తన సంగీతంతో బాగా మెప్పించాడు.ఇందులో పాటలన్నీ బాగా ఆకట్టుకున్నాయి.అక్కడక్కడ ఎడిటింగ్ కాస్త మెప్పించలేకపోయింది.కానీ దర్శకుడు మాత్రం అద్భుతంగా తెరకెక్కించాడు.

విశ్లేషణ:

నిజానికి చాలావరకు అడవి నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి.కానీ ఆ సినిమాలకు ఉన్న కథకు ఈ సినిమాలో ఉన్న కథకు చాలా తేడా ఉంది.

చాలా కొత్తగా ఉంది.హీరో ఇందులో గొర్రెల కాపరి గా కొత్తగా కనిపించాడు.

ఈ సినిమా యువతకు మంచి పాటలు నేర్పించే విధంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

అడవి నేపథ్యంలో కథ కొత్తగా ఆకట్టుకుంది.ఇందులో మాటలు బాగా ఆలోచించే విధంగా ఉన్నాయి.ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.

మైనస్ పాయింట్స్:

రెండవ భాగం బాగా మెల్లగా సాగింది.ఇక అనుకున్నంత స్థాయిలో వి.

ఎఫ్.ఎక్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి.

బాటమ్ లైన్:

అడవిలో అద్భుతంగా తీసిన ఈ కథ కొన్ని పాఠాలు నేర్పే విధంగా ఉన్నాయి.కాబట్టి ఈ సినిమా చూడటం వల్ల కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు.ఈ సినిమా ప్రేక్షకులను పక్కా ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube