థియేటర్లలో ఫ్లాప్ టీవీలో మాత్రం హిట్.. కొండపొలం రేటింగ్ ఎంతంటే?

Vaishnav Tej Kondapolam Movie Rating Details Here

వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన తోనే తను మంచి నటుడని ప్రూవ్ చేసుకున్నారు.ఆ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించారు.

 Vaishnav Tej Kondapolam Movie Rating Details Here-TeluguStop.com

అక్టోబర్ రెండో వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లను సాధించడంలో కొండపొలం ఫెయిలైంది.

వైష్ణవ్ తేజ్ రెండో సినిమాగా ఈ సినిమాను ఎంపిక చేసుకుని తప్పు చేశారని కామెంట్లు వినిపించాయి.

 Vaishnav Tej Kondapolam Movie Rating Details Here-థియేటర్లలో ఫ్లాప్ టీవీలో మాత్రం హిట్.. కొండపొలం రేటింగ్ ఎంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలోని ఓబులమ్మ పాత్రకు రకుల్ న్యాయం చేసినా రకుల్ ఖాతాలో ఈ సినిమాతో మరో ఫ్లాప్ చేరింది.

ఆ తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి రాగా ఓటీటీలో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.థియేటర్లలో, ఓటీటీలో సినిమా ఫ్లాప్ కావడంతో టీవీలో కూడా ఈ సినిమా సక్సెస్ సాధించకపోవచ్చని ప్రేక్షకులు భావించారు.

అయితే ఎవరూ ఊహించని విధంగా టీవీలలో మాత్రం ఈ సినిమా హిట్ అనిపించుకుంది.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానెల్ లో తాజాగా కొండపొలం సినిమా ప్రసారం కాగా ఈ సినిమా ఏకంగా 12.34 టీఆర్పీ రేటింగ్ ను సాధించింది.

Telugu Krish, Vaishnav Teja, Kondapolam, Kondapolam Tv, Mm Keeravani, Maa, Vaishnav Tej-Movie

అర్బన్ ఏరియాలో కొండపొలం రేటింగ్ ను సొంతం చేసుకోగా రూరల్ ఏరియాలో ఈ సినిమాకు 10.54 రేటింగ్ వచ్చింది.పెద్ద సినిమాల స్థాయిలో కొండపొలం సినిమా రేటింగ్ ను సొంతం చేసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Krish, Vaishnav Teja, Kondapolam, Kondapolam Tv, Mm Keeravani, Maa, Vaishnav Tej-Movie

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

వైష్ణవ్ తేజ్ పుట్టినరోజున వెలువడిన కొండపొలం రేటింగ్ వార్త వైష్ణవ్ కు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.

#Vaishnav Tej #Vaishnav Teja #Kondapolam Tv #MM Keeravani #Kondapolam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube