నాని రిజక్ట్ చేసిన స్టొరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన మెగా హీరో వైష్ణవ్ తేజ్.మొదటి సినిమాతోనే అటు మాస్ ఆడియన్స్, ఇటు క్లాస్ ఆడియన్స్ కి కాల్వాసిన సెటిల్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించిన వైష్ణవ్ ఇప్పుడు వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నాడు.

 Vaishnav Tej Green Signal To New Project-TeluguStop.com

అన్న సాయి తేజ్ తరహాలోనే అతనికి కూడా అవకాశాలు వస్తున్నాయి.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మరో వైపు అన్నపూర్ణ క్రియేషన్స్ లో ఒక సినిమా చేయడానికి వైష్ణవ్ కమిట్ అయ్యాడు.

ఈ సినిమా త్వరాలు పట్టాలు ఎక్కనుంది.ఇది లవ్ స్టొరీ కథాంశంతోనే తెరకెక్కబోతుంది.

 Vaishnav Tej Green Signal To New Project-నాని రిజక్ట్ చేసిన స్టొరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ కి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.

ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ భాగా నచ్చడంతో వైష్ణవ్ తేజ్ చేయడానికి ఒకే చెప్పాడని టాక్.అయితే వైష్ణవ్ తేజ్ కంటే ముందుగా ఈ కథని సదరు దర్శకుడు నేచురల్ స్టార్ నానికి చెప్పాడని తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు ఈ కథ తనకి సెట్ కాదని ఆ దర్శకుడికి సూచించినట్లు బోగట్టా.ఈ నేపధ్యంలో ఆ దర్శకుడు వైష్ణవ్ తేజ్ కి ఇదే కథని వినిపించి ఫైనల్ చేయించుకున్నాడు.

యాక్షన్ అండ్ లవ్ స్టొరీగా ఈ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు బోగట్టా.

#Vaishnav Tej #New Project

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు