నాలుగో సినిమా కోసం నిర్మాత నుంచి అడ్వాన్స్ తీసుకున్న వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు వంద కోట్ల కలెక్షన్ సొంతం చేసుకున్న హీరోగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ నిలిచిపోయాడు.ఈ సినిమా అతనికి ఊహించని క్రేజ్ తీసుకొచ్చింది.

 Vaishnav Tej Fourth Movies Confirmed-TeluguStop.com

దీంతో కుర్ర హీరోతో సినిమాలు చేయడానికి ఇప్పుడు దర్శక, నిర్మాతలు అందరూ క్యూ కడుతున్నారు.మాస్ హీరోయిజంతో పాటు, ప్రేమకథలకి సరిపోయే విధంగా అతని లుక్ ఉండటంతో కొత్త కథలతో దర్శకులు అతని దగ్గరకి వస్తున్నారు.

ఉప్పెన రిలీజ్ కి ముందే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాని పూర్తి చేసేశాడు.ఆ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.

 Vaishnav Tej Fourth Movies Confirmed-నాలుగో సినిమా కోసం నిర్మాత నుంచి అడ్వాన్స్ తీసుకున్న వైష్ణవ్ తేజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయనున్నాడు.ఇది ఒక ప్రేమకథా చిత్రమే అని తెలుస్తుంది.

ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కబోతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు వైష్ణవ్ నాలుగో సినిమాకి కూడా ఒకే చెప్పేశాడు.

ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ వైష్ణవ్ హీరోగా ఒక సినిమా చేయడానికి తాజాగా అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇది కూడా ఓ కొత్త దర్శకుడుతోనే ఉంటుందని సమాచారం.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి మెగాస్టార్ నుంచి మెగా హీరోలందరి సపోర్ట్ ఎలాగూ ఉంటుంది.కాబట్టి అతనితో సినిమా చేసిన ప్రమోషన్, ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నిర్మాతలు భావించి వైష్ణవ్ హీరోగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.

త్వరలో నాలుగో సినిమాకి సంబందించిన పూర్తి విషయాలు బయటకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

#Vaishnav Tej #Megastar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు