వాళ్ళతో పోటీ పడుతున్న వైష్ణవ్ తేజ్..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకోగా సెకండ్ మూవీగా వచ్చిన కొండపొలం అంచనాలను అందుకోలేదు.క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వైష్ణవ్ తేజ్ ఖాతాలో ఫెయిల్యూర్ పడ్డది.

 Vaishnav Tej Fight With Twi Big Movies-TeluguStop.com

ఇక తన థర్డ్ సినిమా గిరీశయ్య డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.రంగ రంగ వైభవంగా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా జూలై సెకండ్ వీక్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ సినిమా మొదలైంది.

టైటిల్ ఇంకా డిసైడ్ చేయని ఈ సినిమా బుధవారం మొదలవగా ప్రీ లుక్ పోస్టర్ లోనే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఆల్రెడీ సంక్రాంతికి రెండు భారీ సినిమాలు రిలీజ్ ఎనౌన్స్ చేశాయి.అందులో ఒకటి ప్రభాస్ ఆదిపురుష్ కాగా.

మరొకటి విజయ్ వారసుడు వస్తుంది.ఈ రెండు సినిమాలతో వైష్ణవ్ తేజ్ కి గట్టి పోటీ ఏర్పడుతుందని చెప్పొచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube