ఉప్పెన ఇంత హిట్ అయిన వైష్ణవ్‌ తేజ్ లేట్ ఎందుకు, క్రిష్‌ ఆలోచన ఏంటో?

మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ ఉప్పెన సినిమా గత ఏడాది మార్చి లోనే విడుదల అవ్వాల్సి ఉంది.కాని కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది.

 Vaishnav Tej And Krish Movie Konda Polam Release Date News-TeluguStop.com

దాదాపు 11 నెలల ఆలస్యం తర్వాత ఉప్పెన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఉప్పెన సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అనుకున్నట్లుగానే ఉప్పెన సినిమా ఘన విజయం సాధించింది.చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటీ అంటే వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యింది.

 Vaishnav Tej And Krish Movie Konda Polam Release Date News-ఉప్పెన ఇంత హిట్ అయిన వైష్ణవ్‌ తేజ్ లేట్ ఎందుకు, క్రిష్‌ ఆలోచన ఏంటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రిష్‌ దర్శకత్వంలో కొండ పొలం అనే నవల ఆధారంగా వైష్ణవ్‌ తేజ్ హీరోగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌ గా సినిమా షూటింగ్‌ జరిపారు.షూటింగ్‌ ప్యాచ్‌ వర్క్‌ మినహా మొత్తం పూర్తి అయ్యింది.

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కు పూర్తిగా దూరంగా ఉండే ఈ సినిమా ను క్రిష్‌ ఎప్పుడు విడుదల చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది కనుక సినిమాను రాబోయే రెండు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.

కాని అనూహ్యంగా క్రిష్‌ ఈ సినిమా ను ఏకంగా ఆగస్టు వరకు వాయిదా వేస్తూ వస్తాడని తెలుస్తోంది.ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్రిష్ చెప్పాడట.

ఉప్పెన సినిమా సక్సెస్ అయ్యింది కదా వెంటనే ఈ సినిమాను విడుదల చేస్తే ఆ క్రేజ్‌ తో ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే ఉప్పెన సినిమాకు పూర్తి విరుద్దంగా వైవిధ్యభరితంగా ఈ సినిమా ఉంటుంది.

కనుక వెంటనే ఈ సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోవచ్చు అంటూ క్రిష్ కొండ పొలంను వాయిదా వేస్తూ వస్తున్నారు.

Telugu Konda Polam, Krish, Novel, Raku Preet Singh, Uppena, Vaishnav Tej, Vaishnav Tej And Krish Movie-Movie.

#Vaishnav Tej #Krish #Uppena #VaishnavTej #Konda Polam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు