ఈ పరిస్థితుల్లోనూ 'ఉప్పెన' హీరో కొనసాగిస్తున్నాడా?

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన వైష్ణవ్‌ తేజ్‌ ప్రస్తుతం గిరీశయ్య దర్శకత్వంలో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ఆధిత్య వర్మ కు గిరీశయ్య దర్శకుడు అనే విషయం తెల్సిందే.

 Vaishnav Tej And Girishayya Movie Shooting On Going-TeluguStop.com

తెలుగు అర్జున్ రెడ్డి ని తమిళంలో సూపర్‌ హిట్‌ చేసిన దర్శకుడు గిరీశయ్య ప్రస్తుతం ఉప్పెన హీరో వైష్ణవ్‌ తేజ్ తో సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.బి వి ఎస్ ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

కరోనా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ ను చేస్తున్నారట.సినిమా షూటింగ్‌ విషయంలో గొప్యత మెయింటెన్ చేస్తున్నారట.

 Vaishnav Tej And Girishayya Movie Shooting On Going-ఈ పరిస్థితుల్లోనూ ఉప్పెన’ హీరో కొనసాగిస్తున్నాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా సెకండ్‌ వేవ్‌ ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదు.అలాంటి కరోనా ను ఎదిరించి వైష్ణ వ్‌ తేజ్‌ సినిమా ను చేయడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే వైష్ణవ్‌ తేజ్ రెండవ సినిమా క్రిష్‌ దర్శకత్వం లో పూర్తి అయ్యింది.సినిమా చిత్రీకరణ ముగించిన క్రిష్‌ పరిస్థితులు చక్క బడ్డ తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని క్రిష్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆ సినిమా విడుదల కాకుండానే మూడవ సినిమా ను పట్టాలెక్కించి విడుదలకు కూడా సిద్దం చేసేలా వైష్ణవ్‌ తేజ్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక వెంకీ కుడుముల దర్శకత్వం లో ఒక సినిమా ను వైష్ణవ్ తేజ్ చేయబోతున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమా ను నిర్మిస్తారట.ఇదే ఏడాది ఆ సినిమా కూడా పట్టాలెక్కించే ఉద్దేశ్యంతో వైష్ణవ్‌ తేజ్ తన మూడవ సినిమా ను హడావుడిగా పూర్తి చేస్తున్నాడు.

గిరీశయ్య ఒక విభిన్నమైన ప్రేమ కథతో ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు.తెలుగు ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒక్క సినిమా తోనే వైష్ణవ్‌ తేజ్ మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడు.ఆ కారణంగానే వైష్ణవ్‌ వరుసగా సినిమా లు చేయాలని ఉబలాట పడుతున్నాడు.

#Krish #VaishnavTej #Vaishanav Tej #Girishayya #Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు