సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు హిట్స్ పడాలన్నా, అవకాశాలు రావాలన్న చాలా మంది అదృష్టాన్ని నమ్ముకుంటారు.కానీ, జయపజయాలు అనేవి సినిమా స్ర్కిప్ట్ మీద, దర్శకుడి మేకింగ్ మీద ఆధారపడి ఉంటుందని చాలావరకు ఆలోచించరు.
కొన్ని సినిమాల్లో మంచి కథ ఉన్నా మేకింగ్ ప్లాబ్లమ్ వలన ఒక్కోసారి అవి అట్టర్ ప్లాప్ అవుతుంటాయి.అదేవిధంగా కొన్ని సినిమాలు మేకింగ్ బాగుండి.
కథ సోసోగా ఉన్నా హిట్ అవుతుంటాయి.అయితే, జయపజయాలు అనేవి హీరోహీరోయిన్ల అవకాశాలకు గండికొడుతాయి.
ముఖ్యంగా ఈ ప్రభావం హీరోల కంటే హీరోయిన్లపై ఎక్కువగా ఉంటుంది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి.
కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి.అయితే, ఈ ఏడాది ఆరంభంలో రొమాంటిక్ డ్రామా గా విడుదలైన ‘ఉప్పెన’ మూవీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇందులో నటీనటులుగా వైష్ణవ్ తేజ్,కృతి శెట్టి వెండి తెరకు పరిచయం అయ్యారు.తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించి ఓవర్ నైట్ స్టార్స్‌గా మారిపోయారు.
ఆపై వీరికి వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయని టాక్ నడిచింది.
ఈ క్రమంలోనే ఈనెల 8న క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం సినిమా జనాల ముందుకు వచ్చింది.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆయనకు నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి.కానీ, బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.
తొలి సినిమాతో ఘన విజయం అందుకున్న వైష్ణవ్ రెండో సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్నాడు.ఇకపోతే కృతిశెట్టి వరుసపెట్టి సినిమాలు చేస్తుంది.
ఆమె నటిస్తు్న్న రెండో సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ క్రిస్మస్ కానుకగా థియేటర్లకు రానుంది.ఆ తర్వాత ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, మాచర్ల నియోజక వర్గం, బంగార్రాజు, RAPO -19 వంటి చిత్రాల్లో కృతి నటించనుంది.
కాగా, కృతి రెండో సినిమాతో విజయం అందుకుంటుందా.వైష్ణవ్ లాగే పరాజయాన్ని మూట గట్టుకుంటుందా తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.