ఆ సీన్ లో నటించేటప్పుడు ఏడ్చేశానంటున్న వైష్ణవ్ తేజ్..?

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటులుగా ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ కు ఉప్పెన సినిమాతో పరిచయం కాగా తొలి సినిమాతోనే నటనతో వైష్ణవ్ మంచి మార్కులు కొట్టేశారు.

 Vaishanav Tej Comments About Uppena Movie In An Interview,uppena Movie,tollywood-TeluguStop.com

ఉప్పెన నాలుగు రోజుల కలెక్షన్లు 30 కోట్ల రూపాయల రూపాయల మార్కును దాటగా ఫుల్ రన్ లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఉప్పెన సినిమాలోని అశీ పాత్రకు వైష్ణవ్ తేజ్ నూటికి నూరు శాతం న్యాయం చేశారు.

వైష్ణవ్ తేజ్ తొలి సినిమాలా కాకుండా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ఉప్పెన సినిమాలో నటించారు.అయితే సినిమాలోని ఇతర సీన్లతో పోలిస్తే ఒక సీన్లో మాత్రం చాలా కష్టపడి నటించానని వైష్ణవ్ తేజ్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

మూవీలో హీరోయిన్ ను పట్టుకొని బేబమ్మ నీకొక మాట చెప్పాలి అనే సీన్ లో నటించడం చాలా కష్టంగా అనిపించిందని వైష్ణవ్ అన్నారు.

Telugu Difficult Scene, Intereview, Uppena, Vaishnav Tej-Movie

ఆ సీన్ షూటింగ్ సమయంలో తనకు ఏడుపు వచ్చిందని సినిమా గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాన్ని వైష్ణవ్ తేజ్ వెల్లడించారు.మరోవైపు ఈ సినిమా తరువాత వైష్ణవ్ తేజ్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారో తెలియాల్సి ఉంది.సాధారణంగా తొలి సినిమాతోనే ఉప్పెన లాంటి సక్సెస్ ను అందుకోవడం అందరికీ సాధ్యం కాదు.

చాలామంది హీరోలు ఇప్పటికీ సరైన సక్సెస్ లేక కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కొంటుంటే వైష్ణవ్ మాత్రం తొలి సినిమాతోనే అరుదైన రికార్డునులను క్రియేట్ చేస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మాత్రం స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమనే చెప్పాలి.

మెగా హీరోలతో పాటు ఇతర హీరోల డెబ్యూ రికార్డులను బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్ భవిష్యత్తులో స్టార్ హీరో స్థాయికి ఎదుగుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube