అలిసిపోయానంటూ లేఖ రాసిన వైద్యుడు.. నెట్టింట వైరల్!

ప్రపంచంలో కరోనా విజృంభన నుంచి ఎంతోమంది ప్రజలు ఆ వైరస్ కు బలైపోయారు.పూర్తిస్థాయిలో ఈ వైరస్ ముగియకముందే.

 Doctor Letter, Aravinda Srinivas,   Tamilnadu Govt, Movies, Hero Vijay, Simbu, N-TeluguStop.com

మరో కొత్త వైరస్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాసిన ఓ వైద్యుని లేఖ అందరిని బాధ పడేలా చేసింది.

తమిళనాడు థియేటర్ లో 100% ప్రేక్షకులను అనుమతించేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా ఈ నిర్ణయంపై కొందరి వాదనలు వినిపిస్తున్నాయి.పూర్తిస్థాయిలో కరోనా పూర్తి కాకముందే ప్రభుత్వం చేపట్టిన‌ నిర్ణయం సరైంది కాదంటూ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ నిర్ణయంపై ఓ వైద్యుడు రాసిన లేఖ కూడా అందరి హృదయాలను తట్టింది.

Telugu Theater, Letter, Doctors Letter, Tamil Nadu, Vijay, Strain, Palani, Shimb

పుదుచ్చేరిలో.జవహర్ లాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెసిడెంట్ డాక్టర్ గా పని చేస్తున్నా అరవింద శ్రీనివాస్.పళని ప్రభుత్వం, హీరో విజయ్, శింబు లపై ఉద్దేశిస్తూ.

థియేటర్ లో 100% ప్రవేశం పై ఓ లేఖ రాశారు.ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Telugu Theater, Letter, Doctors Letter, Tamil Nadu, Vijay, Strain, Palani, Shimb

‘నేను అలసిపోయాను.మేమంతా అలసిపోయాం.నాలాంటి వేల మంది వైద్యులు కూడా అలిసిపోయారు.ఆరోగ్య జాగ్రత్త సిబ్బందులు కూడా అలిసిపోయారు.పారిశుద్ధ కార్మికులు అలిసిపోయారు.ఇలాంటి ఊహించని వైరస్ విజృంభణ వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు ఎంతో మంది సిబ్బందులు, వైద్యులు అలిసిపోయాము.

చూసేవాళ్ళకు మా కష్టం కనిపించకపోవచ్చు.ఎందుకంటే మా ముందు ఎలాంటి కెమెరాలు లేవు.

మేము హీరోలం అంతకన్నా కాము.కానీ మాకు ఊపిరి పీల్చుకోవడానికి కాస్త సమయం కావాలి.

ఇంతటితో ఈ వైరస్ పూర్తిస్థాయిలో పోలేదు.అంతే కాకుండా మరో కొత్త వైరస్ కూడా విజృంభించింది.

కాబట్టి ఈ సమయంలో థియేటర్లపై ప్రవేశం అంటే ఆత్మహత్య నే పైగా వంద శాతం మంది తో కలసి ఏ హీరో కానీ.ఏ రాజకీయ అధికారులు గాని చూడటానికి సిద్ధంగా ఉండరు” అంటూ రాసిన ఆ వైద్యుని లేక అందరి హృదయాలను తడిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube