వాహనాలకు నిమ్మకాయ ఎందుకు కడతారో తెలుసా?

మనం సాధారణంగా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు పూజ చేయించి నిమ్మకాయలు కడుతూ ఉంటాం.అలాగే ప్రతి వారం నిమ్మకాయలు కడుతూ ఉంటాం.

 Vahanalaku Nimmakayalu Enduku Kadataro Telusa-TeluguStop.com

అసలు వాహనాలకు నిమ్మకాయలను ఎందుకు కడతారో తెలుసా? ఉగ్ర దేవతా శాంతికి నిమ్మకాయలను, గుమ్మడికాయలను వాడతారు.వాహనాలు ప్రమాదాలు జరగకుండా ఉండటానికి దేవతల కన్నా ఉగ్ర దేవతల మీద ఆధారపడతారు.

సాధారణంగా చాలా మంది వాహనాలకుపూజ ఆంజనేయస్వామి గుడిలో చేయిస్తారు.పూజ చేయించి ఆ నిమ్మకాయలను వాహనాలకు కడతారు.

నిమ్మకాయలతో దిష్టి తీసి వాహనంతో తొక్కిస్తారు.

ఇలా చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని నమ్మకం.అంతేకాక పుల్లగా ఉండే నిమ్మకాయలు,కారంగా ఉండే ఎండుమిరపకాయలు దిష్టి కొరకు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? వీటిని వాహనాలకు,దుకాణాల వద్ద ఎందుకు వ్రేడదీస్తారో…దానికి ఒక కారణంఉంది .గ్రహాల్లో ఉగ్ర రూపం,ఎర్రగా ఉండే గ్రహం కుజ గ్రహం.

కుజ గ్రహం ప్రమాదాలకు కారణం అవుతుంది.కుజునికి అది దైవం ఆంజనేయస్వామి.అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు.అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు.

కారం రవిగ్రహానికి చెందినది.అధికారానికి రవి కారకుడు.

వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube