వదినమ్మ సీరియల్ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు!

స్టార్ మా లో ప్రసారమవుతున్న వదినమ్మ సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.కార్తీకదీపం సీరియల్ తర్వాత ఈ సీరియల్ ఎక్కువ రేటింగ్ ను సంపాదించుకుంది.

 Vadinamma Serial Actress Sujitha Dhanush Know Details About Her-TeluguStop.com

ఇక ఈ సీరియల్ నలుగురు అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం గురించి, వారి మధ్య ఉన్న ప్రేమ గురించి అద్భుతంగా చూపిస్తుంది.ఇందులో ప్రభాకర్, సుజిత ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే సుజిత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 Vadinamma Serial Actress Sujitha Dhanush Know Details About Her-వదినమ్మ సీరియల్ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుజిత బుల్లితెర లో అడుగు పెట్టక ముందు ఆమె ఓ సినీ నటి.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది.ఈమె తల్లిదండ్రులు టి.

ఎస్.మణి, రాధా. ఈమె ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ సోదరి.తిరువనంతపురం లో జన్మించిన ఈమె.ప్రస్తుతం ఆమె వయసు 37 ఏళ్లు.1983లో సినీ ప్రవేశం చేసిన సుజిత.మొదట పసివాడి ప్రాణం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.అంతేకాకుండా వెంకటేష్ చెల్లెలు గా ఓ సినిమాలో నటించింది.చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటించింది.కొన్ని సినిమాలలో అతిథి పాత్రలో కూడా నటించింది.

Telugu Background, Career, Dhanush, Family, Full Details, Husband, Movies Acted, Serial, Sujitha, Sujitha History, Vadinamma-Movie

ఇక ఈమె ప్రకటనలు రూపొందించే ధనుష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.వీరికి ఒక బాబు ఉన్నాడు.ఇక మలయాళంలో ‘స్వాంతం మలూట్టీ‘ లో ప్రధాన పాత్ర చేసింది.ఇక అలా బుల్లితెరపై కూడా అడుగు పెట్టగా మారుతని అనే సీరియల్ ద్వారా మంచి పేరు సంపాదించుకుంది.

బుల్లితెరపై కూడా తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సుజిత స్టార్ మా లో ప్రసారమవుతున్న వదినమ్మ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో ఈమె నటన ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

#Movies Acted #Background #Family #Serial #Career

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు