అభిమానులకు శుభవార్త చెప్పిన వడ్డే నవీన్.. రీఎంట్రీ ఇస్తానంటూ?

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా వడ్డే నవీన్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ ప్రముఖ నిర్మాత అనే సంగతి తెలిసిందే.

 Vadde Naveen Good News To Fans For Reentry To Industry Details, Interesting Comm-TeluguStop.com

వడ్డే నవీన్ యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉంటున్నారు.వడ్డే నవీన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకునే అభిమానుల సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉంది.

తాజాగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వడ్డే నవీన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

లవ్ స్టోరీలతో పాటు కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించి వడ్డే నవీన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తెలుగులో 30కు పైగా సినిమాలలో వడ్దే నవీన్ నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.అయితే 2001 సంవత్సరం తర్వాత వడ్డే నవీన్ నటించిన పలు సినిమాలు ఫ్లాప్ కావడంతో నవీన్ సినిమాలకు దూరమయ్యారు.

ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎటాక్ సినిమాలో వడ్డే నవీన్ చివరగా కనిపించారు.

ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత వడ్డే నవీన్ మాట్లాడుతూ సినిమాలలో రీఎంట్రీకి సిద్ధమేనని కీలక ప్రకటన చేశారు.

Telugu Attack, Maa, Tollywood, Vadde Naveen, Vaddenaveen-Movie

కథ నచ్చడంతో పాటు పాత్ర నచ్చితే సినిమాలలో నటిస్తానని వడ్డే నవీన్ చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు తనకు ఇంటర్వ్యూలు ఇచ్చే అవసరం రాలేదని త్వరలో ఇంటర్వ్యూలు కూడా ఇస్తానని వడ్డే నవీన్ చెప్పుకొచ్చారు.వడ్డే నవీన్ తాజా ప్రకటన గురించి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Attack, Maa, Tollywood, Vadde Naveen, Vaddenaveen-Movie

వడ్డే నవీన్ తాజా ప్రకటనతో దర్శకనిర్మాతలు ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతారేమో చూడాల్సి ఉంది.1990 దశకంలో మంచి పాపులారిటీ ఉన్న హీరోలలో వడ్డే నవీన్ ఒకరు.రీఎంట్రీలో వడ్డే నవీన్ ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.

వడ్డే నవీన్ రీఎంట్రీలో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube