వ్యాక్సిన్లు త‌మ దేశానికి వ‌ద్దంటున్న కిమ్‌.. ఎందుకో తెలిస్తే..

ఇప్పుడు క‌రోనా ప్ర‌పంచాన్ని ఎలా వ‌ణికిస్తుందో అంద‌రికీ తెలిసిందే.ఇలాంటి త‌రుణంలో ప్ర‌తి దేశం కూడా ఈ మ‌హమ్మారిని ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ల బాట ప‌డుతోంది.

 Vaccines Are Coming To Their Country If You Know Why , Vaccines, Kim Jong Un-TeluguStop.com

చాలా దేశాల పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.రోజుకు ల‌క్ష‌లాది మందికి వ్యాక్సిన్లు వేస్తూ త‌మ దేశాల‌ను కాపాడుకుంటున్నాయి.

ఆర్థికంగా వెన‌క‌బ‌డిన దేశాలు కూడా త‌మ స్థాయికి మించి వ్యాక్సిన్లను కొని పడేస్తున్నాయంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.ఇక పెద్ద దేశాలు అయితే ముందే అడ్వాన్సులు చెల్లించి మ‌రీ కోట్లాది డోసులను బుక్ చేసుకుంటున్నాయి.

ఎందుకంటే అంద‌రికీ వ్యాక్సిన్లు అందినప్పుడే ఈ క‌రోనాను పూర్తిగా కంట్రోల్ చేయ‌గ‌లుగుతామ‌ని అప్పుడు ప్ర‌పంచం అంతా సేఫ్ గా ఉంటుంద‌ని ఐరాస తట్టి చెబుతోంది.అయితే ఈ క్ర‌మంలోనే ఆర్థికంగా బ‌ల‌మైన దేశాలు పేద దేశాల‌కు తలా కొన్ని వ్యాక్సిన్లను అందిస్తున్నాయి.

ఇక ఇదే క్రమంలో నార్త్ కొరియా దేశానికి కూడా కొన్ని దేశాలు క‌లిసి ఒక ముప్పై లక్షల వ్యాక్సిన్లు అందించేందుకు ఆఫర్ ఇచ్చాయి.కానీ ఆ దేశ అధ్య‌క్షుడు ప్ర‌పంచానికి ఎంత భిన్నంగా ఉంటారో అంద‌రికీ తెలిసిందే.

ఇక ఇక్క‌డ కూడా ఆయ‌న తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది.

అదేంటంటే ఆయ‌న త‌మ దేశానికి ఎలాంటి డోసులను వ‌ద్ద‌ని తిరస్కరించారట.

త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అవసరం లేదని, ఇక త‌మ దేశానికి ఇస్తాన‌న్న ఆ వ్యాక్సిన్ డోసుల‌ను మాత్రం వేరే పేద దేశాలకు ఇవ్వమని సూచిస్తున్నారంట‌.ఇక ఇంకో అడుగు ముందుకేసి త‌మ దేశానికి కరోనాను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసని, ఇప్ప‌టికే తామే ఇందులో ముందు వ‌రుస‌లో ఉంటున్నామ‌ని తెలిపింది.

కాబ‌ట్టి క‌రోనా ఎలా డీల్ చేయాలో తెలిసినప్పుడు త‌మ‌కు వ్యాక్సిన్లు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.వ్యాక్సిన్లు దొరక్క ఇబ్బంది ప‌డుతున్న త‌రుణంలో ఫ్రీగా ఇస్తామ‌న్నా కూడా ఇలా వ‌ద్ద‌న‌డం నిజంగానే విడ్డూరంగా ఉంది క‌దూ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube